విజయ్‌ సంగీతంతో విభూతి చిత్రం

By Staff

డాక్యుమెంటరీలు, కార్పొరేట్‌ ఫిలింస్‌ రూపొందిస్తున్న విభూతి సంస్థ సినిమా నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. విజయదశమి నాడు పూజా కార్యక్రమాలు నిర్వహించి తమ మొదటి సినిమా కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించిందీ సంస్థ. ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌, నందనవనం 120 కిలోమీటర్స్‌ చిత్రాలకు సంగీతం అందించిన విజయ్‌ కురాకుల విభూతి ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తను సంగీతం అందించిన రెండు చిత్రాలలో రీరికార్డింగ్‌కే ప్రాధాన్యం ఉందని, ఆ రెండు చిత్రాలలో పాటలు లేవని విజయ్‌ ఈ సందర్భంగా చెప్పారు. విభూతి ఎంటర్‌టైన్‌మెంట్‌ వారి చిత్రంలో ఐదు పాటలు ఉంటాయని, కథానుసారం మంచి సంగీతం అందించేందుకు ప్రయత్నిస్తున్నానని ఆయన అన్నారు. ఈ చిత్రం ద్వారా సౌరెక్‌ సామంత దర్శకునిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

ప్రస్తుత నగర జీవితాల్లోని అంతఃసంఘర్షణను వస్తువుగా ఎంచుకుని, వినోద ప్రధానంగా కథను సిద్ధం చేశామని దర్శకుడు సౌరెక్‌ సామంత వెల్లడించారు. నేటి తరాన్ని ఆలోచింపజేసే విధంగా ఈ సినిమా రూపొందనుందని చిత్రం ఎగ్జిక్యుటివ్‌ ప్రొడ్యూసర్‌ పవన్‌కుమార్‌ నేరెళ్ల తెలిపారు. అల్తాఫ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

మరిన్నికథనాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X