ఎస్పీ బాలు ఆరోగ్యం కోసం వెంకయ్యనాయుడు విశ్వ ప్రయత్నం.. స్నేహితుడి కోసం ఆ సాధనం తెప్పించి..

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇకలేరనే వార్తతో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్తను జీర్ణించుకోలేకపోయారు. ఎస్పీ బాలు అంటే వెంకయ్యనాయుడికి ఎనలేని గౌరవం, అభిమానం, స్నేహం ఉంది. పలు సందర్భాల్లో ఎస్పీ బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొనే వారు. ఇటీవల ఎస్పీ బాలు అనారోగ్యంతో ఎంజీఎం హాస్పిటల్‌లో చేరగానే ఆయన ఆరోగ్యంపై కొన్ని చర్యలు తీసుకోవడం వారిద్దరి మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచిన సంఘటన ఇదే..

ఎస్పీ బాలు, వెంకయ్యనాయుడు మధ్య స్నేహబంధం

ఎస్పీ బాలు, వెంకయ్యనాయుడు మధ్య స్నేహబంధం

భారతీయులందరూ గర్వించే గొప్ప గాయకుడిగా బాలసుబ్రమణ్యం, దేశ గర్వించదగిన రాజకీయ నేత వెంకయ్య నాయుడు ఒకే జిల్లా నెల్లూరు నుంచి రావడం తెలిసిందే. సమకాలీన పరిస్థితులు, వారు రాణిస్తున్న రంగాలకు అతీతంగా బాలు, వెంకయ్య మధ్య ఎనలేని బంధం ఏర్పడింది. ఒకరంటే మరొకరి చెప్పలేనంత గౌరవం, అభిమానం, ప్రేమ ఉన్నాయనే విషయం పలు సందర్భాల్లో వ్యక్తమైంది.

ఎస్పీ బాలు అనారోగ్యం వార్తతో

ఎస్పీ బాలు అనారోగ్యం వార్తతో

తనకు సన్నిహితుడు, స్నేహితుడు, అప్తుడైన ఎస్పీ బాలు సుబ్రమణ్యం తీవ్ర అనారోగ్యానికి గురైన వార్త ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని తీవ్రంగా కలిచి వేసింది. సమయం చిక్కినప్పుడల్లా చెన్నై ఎంజీఎం హాస్పిటల్ వర్గాలు, తమిళనాడు ప్రభుత్వ అధికారులతో చర్చినట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి గురించి వెంకయ్యనాయుడు అడిగి తెలుసుకొనే వారని చెప్పారు.

ఎస్పీ బాలు కోసం ప్రత్యేకమైన యంత్ర సాధనం

ఎస్పీ బాలు కోసం ప్రత్యేకమైన యంత్ర సాధనం

అయితే ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలసుబ్రమణ్యానికి ఓ ప్రత్యేకమైన వైద్య పరికరం, యంత్ర సాధనం అవసరం ఏర్పడింది. అయితే ఎంజీఎం హాస్పిటల్‌లో లేకపోవడం, అలాంటి పరికరం అపోలో హాస్పిటల్‌లో ఉందనే వార్తను తెలుసుకొన్న వెంకయ్యనాయుడు.. ఆ హాస్పిటల్ టాప్ మేనేజ్‌మెంట్‌తో స్వయంగా మాట్లాడి సమకూర్చినట్టు సన్నిహితులు ఇటీవల పేర్కొన్నారు.

స్వయంగా టాప్ యాజమాన్యంతో

స్వయంగా టాప్ యాజమాన్యంతో

ఎస్పీ బాలు శరీర దిగువ భాగానికి ఫిజియోథెరపీ చేయాల్సి రావడంతో స్వయంగా అపోలో హాస్పిటల్ అధినేత ప్రతాప రెడ్డితో మాట్లాడి ఆ పరికరాన్ని బాలు కోసం సమకూర్చినట్టు సన్నిహితులు వెల్లడించారు. ఎంజీఎం హాస్పిటల్‌లో ఉన్నకాలంలో పలుమార్లు ఎస్పీ బాలు ఆరోగ్యం గురించి వాకబు చేసినట్టు వెల్లడిస్తున్నారు. గురువారం రాత్రి (సెప్టెంబర్ 24వ తేదీన) కూడా వెంకయ్యనాయుడు స్వయంగా ఫోన్ చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

Recommended Video

Rajinikanth,Pawan Kalyan,K viswanath Expresses Their Condolences For SPB
అంతలోనే ఇలా జరగడం బాధకారం..

అంతలోనే ఇలా జరగడం బాధకారం..

ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతికి సంతాపం తెలియజేస్తూ వెంకయ్యనాయుడు భావోద్వేగానికి గురయ్యారు. ఐదు దశాబ్దాలకుపైగా తన అమృత గానంతో ప్రజలని అలరింపజేసిన బాలసుబ్రమణ్యం అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది. అనారోగ్యం నుంచి వారు కోలుకుంటున్నట్టు తెలిసి చాలా సంతోషించాం. అంతలోనే ఇలా జరిగడం చాలా బాధగా ఉంది. కరోనా బారిన పడి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాటి నుంచి నేటి వరకు ఆయన ఆరోగ్యంపై వాకబు చేస్తున్నా అని వెంకయ్యనాయుడు తన సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్పీ బాలు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X