twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చట్టాన్ని చేతులోకి తీసుకోవద్దు.. చరిత్రను వక్రీకరిస్తారా? పద్మావతిపై వెంకయ్య సీరియస్

    పద్మావతి చిత్ర వివాదంపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించాడు. ఇండియా టుడే లిటరరీ ఫెస్టివల్ పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ విషయంలోనైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ఆయన సూచించా

    By Rajababu
    |

    Recommended Video

    చరిత్రను వక్రీకరిస్తారా? పద్మావతిపై వెంకయ్య సీరియస్

    పద్మావతి చిత్ర వివాదంపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించాడు. ఇండియా టుడే లిటరరీ ఫెస్టివల్ పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ విషయంలోనైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ఆయన సూచించాడు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి తీవ్రతకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు.

    వివాదాల సుడిగుండంలో పద్మావతి

    వివాదాల సుడిగుండంలో పద్మావతి

    సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన పద్మావతి చిత్రం వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నది. దాంతో దేశవ్యాప్తంగా ఆ చిత్రం చర్చనీయాంశమైంది. రాణి పద్మావతి జీవిత కథా నేపథ్యంగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రంలో అందాల తార దీపికా పదుకొన్, రణ్‌వీర్ సింగ్, షాహీద్ కపూర్ తదితరులు నటించారు.

    రాణి పద్మావతి కథను

    రాణి పద్మావతి కథను

    చరిత్రను వక్రీకరించి రాణి పద్మావతి కథను భన్సాలీ తెరక్కించారని హిందుత్వ సంస్థలు మండిపడుతున్నాయి. దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు, ఆందోళనలను, దిష్టిబొమ్మల దగ్ధం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు.

    అడ్డుకొంటున్న తీరు బాగాలేదు

    అడ్డుకొంటున్న తీరు బాగాలేదు

    పద్మావతి చిత్రాన్ని అడ్డుకొంటున్న తీరు బాగాలేదు. ప్రజాస్వామ్యంలో ఇది ఆమోదయోగ్యం కాదు. ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది. కానీ భౌతికదాడులకు దిగుతామని హెచ్చరించే పద్దతి తీవ్ర అభ్యంతరకరం. ఏదైనా విషయంపై అభిప్రాయ భేదాలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి అని వెంకయ్య నాయుడు అన్నారు.

    అలా చెప్పడం లేదు..

    అలా చెప్పడం లేదు..

    నేను ఏ ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకొని ఈ మాట చెప్పడం లేదు అని వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ సందర్భంగా గరం హవా, కిస్సా కుర్సీ కా, ఆందీ చిత్రాలను ప్రస్తావించారు. అయితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొంటామంటే కుదరదు. ఇతరుల మనోభావాలు కించపరిచే విధంగా ఏదీ ఉండకూడదు అని వెంకయ్య స్పష్టం చేశారు.

    English summary
    Padmavati row: Vice President Venkaiah Naidu says violent threats are unacceptable in a democracy. Regarding the Padmavati row, Vice President Venkaiah Naidu has said that people have the right to protest in a democratic manner, but they cannot physically obstruct and give violent threats. Sanjay Leela Bhansali's Padmavati, starring Deepika Padukone, Ranveer Singh and Shahid Kapoor, has been in the midst of a whirlpool of controversy, and has now become a nation-wide debate."This is not acceptable in a democracy. You have the right to protest in a democratic manner, go to the appropriate authorities...you cannot physically obstruct and can't give violent threats. Let us not undermine the rule of law," Venkaiah Naidu said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X