Chhaava : వివాదాల్లో రష్మిక మందన్న ‘ఛావా’.. రూ.100 కోట్ల పరువు నష్టం దావా.?
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్న చిత్రం 'ఛావా'. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌషల్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో నటించారు. నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఫీమేల్ లీడ్. లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా డైరెక్టర్ చేశారు. ఫిబ్రవరి 14న ఈ హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే ఈ మూవీకి పెద్దఎత్తున ప్రశంసలు అందాయి. ప్రేక్షకులు చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై దినేష్ విజన్ రూ.130 కోట్లు వెచ్చించి నిర్మించారు. కాగా బాక్సాఫీస్ వద్ద 'ఛావా' దూకుడుగా వ్యవహరిస్తోంది.
మరాఠా సామ్రాజ్యం రెండో పాలకుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని పవర్ ఫుల్ యాక్షన్ తో నిర్మించారు. విక్కీ కౌషల్ - ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో జీవించారు. ఇక రష్మిక మందన్న ఆయన భార్యగా యేసుబాయ్ భోన్ల్సేగా అలరించారు. అక్షయ్ ఖన్నా - ఔరంగజేబ్ గా విధ్వంసం సృష్టించారు. మిగితా పాత్రల్లోనూ నటీనటులు మెప్పించారు. రెండు వారాలుగా ఈ చిత్రం విశేష ఆదరణతో దుమ్ములేపుతోంది. హిస్టారికల్ ఫిల్మ్ కావడంతో వివాదాలకు తెరలేపేందుకు ఎందరో ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.

రెండు వారాలు 'ఛావా' బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తుండటం విశేషంగా మారింది. ఇలా సక్సెస్ ఫుల్ రన్ అవుతున్న ఈ చిత్రాన్ని అనుకోని వివాదం చుట్టుముట్టింది. చర్రితను చెప్పే సినిమా కావడం.. అందులోనూ శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ జీవితం ఆధారంగా తెరకెక్కడంతో అందరి దృష్టి ఈ చిత్రంపైనే పడింది. ఈ క్రమంలోనే తమ వంశస్తులను తప్పుగా చూపించారంటూ షిర్కే వారసులు సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
'ఛావా' చిత్రంలో చూపించిన గానోజీ షీర్కే, కానోజీ షిర్కే పాత్రలను తప్పుగా చూపించారని అభిప్రాయపడ్డారు. శంభాజీకి ఎంతో సన్నిహితంగా వారిని వెన్నుపోటు పొడిచినట్టు చూపించడం సరికాదంటూ అభ్యంతర వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మొఘల్ సామ్రాజానికి శంభాజీని దొరికిపోయేలా షిర్కే పాత్రలను రచించడం సబబు కాదన్నారు. శంభాజీకి తాము ఎంతో సన్నిహితులని వెల్లడించారు. ఈమేరకు 'ఛావా' యూనిట్ కు షిర్కే వారసులు నోటీసులు కూడా పంపించారంట. ఆ సన్నివేశాలను సరిచేకపోతే రూ.100 కోట్ల వరకు పరువు నష్టం దావా కూడా వేస్తామని హెచ్చరినట్టు బీటౌన్ నుంచి వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ చిత్రానికి షిర్కే వారసుల రూపంలో పెద్ద షాక్ తగిలింది. దీంతో యూనిట్ సభ్యులు ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ కలెక్షన్లు కూడా వసూల్ చేస్తోందీ చిత్రం. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్కోర్, సౌండ్‌ట్రాక్ ఆల్బమ్‌ను అందించారు. ఛావా తొలిరోజే రూ.33 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది. వారం రోజులు ముగిసే సరికి ఈ చిత్రం రూ.157 కోట్లు వసూళ్లు చేసింది. ఇక రెండో వారంలో రూ. 300 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. ఫిబ్రవరి 25తో ఈ చిత్రం రూ.513 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











