రామ్ చరణ్ అబద్దాల కోరు!, దాడికిగురైన టెక్కీ స్పందన
ఈ నేపథ్యంలో దాడిగురైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఫనీష్ ఓ ఆంగ్లప్రతికతో మాట్లాడుతూ చెర్రీ వ్యాఖ్యాలను ఖండించారు. రామ్ చరణ్‌కు తాము ఎలాంటి క్షమాపణ చెప్పలేదని స్పష్టం చేసారు. రాష్ డ్రైవింగ్ చేసి రామ్ చరణ్ కారుకు డాష్ ఇచ్చినట్లు వస్తున్న ఆరోపణల్లోనూ నిజం లేదన్నారు.
తమపై దాడి జరిగిన తర్వాత కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లాము. అయితే వెంటనే మా ఫ్యామిలీ మెంబర్స్ నుండి ఫోన్ వచ్చింది. కేసు పెట్టవద్దని, అనవసర ఇబ్బందులు ఎందుకని వారించారని, ఆకారణంగానే తాము కంప్లైంట్ చేయలేదని వెల్లడించారు. పోలీసులు కూడా తమపై ఎలాంటి ఒత్తిడి తేలేదన్నారు.
కాగా.....దాడి జరిగి మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా పోలీసులు కేసు నమోదు చేయక పోగా, దానికి బాధితులు ఫిర్యాదు చేయలేదనే సాకు చూపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బున్నోళ్ల కండకావరానికి ఇది నిదర్శనమనే వాదనా వినిపిస్తోంది. సలీం అనే న్యాయవాది ఈ ఘటనపై మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేసారు.
దాడి సంఘటనను సుమోటాగా తీసుకుని కేసు నమోదు చేయాలని, బాధితులు ఫిర్యాదు చేయలేదనే కారణంగా కేసు పెట్టక పోవడం వెనక కేంద్ర మంత్రి చిరంజీవి ఒత్తిడి ఉందని ఆయన పేర్కొన్నారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా దాడి కేసును సుమోటోగా స్వీకరించాలని కోరారు. న్యాయవాది పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన హెచ్ఆర్‌సి ఈ వ్యవహారంపై జూన్ 18లోగా వివరణ ఇవ్వాలని హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్‌ను ఆదేశించింది.


Click it and Unblock the Notifications












