twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విక్టోరియా సీక్రెట్ ‘బ్రా’ ఫ్యాషన్ షో వివరాలు...

    By Bojja Kumar
    |

    లండన్: ఇంటర్నేషనల్ లింగరీ బ్రాండ్ అయిన విక్టోరియా సీక్రెట్.....ఫ్యాషన్ షో 2014 లండన్‌లో ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఈ ఫ్యాషన్ షోలో పలువురు హాలివుడ్ భామలు, హాట్ అండ్ సెక్సీ మోడళ్లు విక్టోరియా బ్రాండ్ లో దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేయనున్నారు. ఈ సంవత్సరాంతంలో అతిపెద్ద అందాల షో ఇదే అని అంటున్నారు.

    14 దేశాల నుండి దాదాపు 27 మంది టాప్ మోడల్స్ ఈ ఫ్యాషన్ షోలో పాల్గొంటున్నారు. కొన్ని కొత్త మొహాలు కూడా ర్యాంపు షోపై కనిపించనున్నాయట. పలువురు హాలీవుడ్ స్టార్స్ ఈ ఫ్యాషన్ షోకు హాజరై సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తారని టాక్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, లగ్జరీ లింగరీ బ్రాండ్‌గా పేరుగాంచిన విక్టోరియా సీక్రెట్ ఈ ఫ్యాషన్ షోలో సరికొత్త డిజైన్లు ఈ ఫ్యాషన్ షో ద్వారా ప్రవేశ పెట్టనుందట.

    లండన్ టైం ప్రకారం మంగళవారం రాత్రి ఈ కార్యక్రమం జరుగనుంది. మరో 10 రోజుల తర్వాత అంటే డిసెంబర్ 11న రాత్రి 7.30 గంటలకు ఫాక్స్ 8 ఛానల్‌లో ఈ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనబోయే హాట్ బ్యూటీల వివరాలు స్లైడ్ షోలో...

    అడ్రియాన లిమా

    అడ్రియాన లిమా

    విక్టోరియా ఏంజిల్ మోడల్ అయిన అడ్రియానా లిమా ఈ ఫ్యాషన్ షోలో దాదాపు 2 మిలియన్ డాలర్ల విలువైన ఫాంటసీ బ్రాను ధరించి ర్యాంపు వాక్ చేయబోతోందట.

    అలెసాండ్రా అంబ్రోసియో

    అలెసాండ్రా అంబ్రోసియో

    విక్టోరియా ఏంజిల్ మోడల్ అయిన అలసాండ్రా అంబ్రోసియో ఈ రోజు సాయంత్రం జరిగే ఫ్యాషన్ షోలో వజ్రాలు పొదిగిన బ్రా ధరించి దర్శనమివ్వబోతోంది.

    బెహాటి ప్రిన్స్‌లూ

    బెహాటి ప్రిన్స్‌లూ

    అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ ఆడమ్ లెవిన్స్ భార్య, విక్టోరియా సీక్రెట్ ఏంజిల్‌గా 2009 నుండి కొనసాగుతున్న బెహాటి ప్రిన్స్ లూ కూడా ఈ ఫ్యాషన్ షోలో అందాల విందు చేయబోతోంది.

    కాన్డిస్ స్వానెపోల్

    కాన్డిస్ స్వానెపోల్

    గత ఫ్యాషన్ షోలో రెడ్ బెజవెల్డ్ ఫాంటసీ బ్రా ధరించి దర్శన మిచ్చిన కాన్డిస్ స్వానెపోల్ ఈ ఫ్యాషన్ షోలో కూడా సరికొత్త డిజైన్లు ధరించి కనిపించబోతోంది.

    గ్రేస్ మహారీ

    గ్రేస్ మహారీ

    గ్రేస్ మహారీ...ఈ ఏడాది జరుగుతున్న ఫ్యాషన్ షోలో కనిపించబోతున్న కొత్త మొహం.

    ఇరినా షారిపోవా

    ఇరినా షారిపోవా

    ఉబ్జెకిస్థాన్ లో పుట్టి...రిపబ్లిక్ ఆఫ్ టాటార్‌స్తాన్‌లో పెరిగిన ఇరినా షారిపోవా ఈ సారి ఈ ఫ్యాషన్ షోలో కనిపించబోతున్న కొత్త మొహం.

    కార్లి క్లోస్

    కార్లి క్లోస్

    గత ఫ్యాషన్ షోలో తన అందాలతో అభిమానులకు మత్తెక్కించిన విక్టోరియా ఏంజెల్ కార్లి క్లోస్ కూడా ఈ రోజు రాత్రి ఫ్యాషన్ షోలో సందడి చేయబోతోంది.

    లిలీ ఆల్డ్రిడ్జ్

    లిలీ ఆల్డ్రిడ్జ్

    విక్టోరియా సీక్రెట్ ఏంజిల్, స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేట్ స్విమ్ షూట్ ఇష్యూ మోడల్ లిలీ ఆల్డ్రిడ్జ్ కూడా ఈ ఫ్యాషన్ షోలో సందడి చేయబోతోంది.

    రోమీ స్ట్రిజ్డ్

    రోమీ స్ట్రిజ్డ్

    ఈమె ఈ సారి కొత్తగా ఫ్యాషన్ షోలోకి ఎంటరవుతున్న డచ్ బ్యూటీ.

    డౌజెన్ క్రోస్

    డౌజెన్ క్రోస్

    డచ్ మోడల్, నటి అయిన డౌజెన్ క్రోస్ సీక్రెట్ ఏంజిల్ గా 2008 నుండి కొనసాగుతోంది. ఈ రోజు రాత్రి జరిగే ఫ్యాషన్ షోలో తన బికినీ బాడీ ప్రదర్శించబోతోంది.

    లుమి లాంబెర్ట్

    లుమి లాంబెర్ట్

    ఈ 19 ఏళ్ల బెల్జియం అండ్ జపనీస్ బ్యూటీ ఈ ప్యాషన్ షోలో కనిపించబోతున్న మరో న్యూ ఫేస్.

    స్టెల్లా మాక్స్‌వెల్

    స్టెల్లా మాక్స్‌వెల్

    స్టెల్లా మాక్స్ వెల్...2015 విక్టోరియా సీక్రెట్ కలెక్షన్ ఫీచర్లో ఉంది. ఈ ర్యాంపు షోలో అమ్ముడు మెరవబోతోంది.

    English summary
    Victoria's Secret Fashion Show 2014 is all set to glam up in London. Before the biggest fashion show kicks off, we are really excited to know who all are going to walk the runway this year for the show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X