విక్టరీ వెంకటేష్ ‘వివేకానందుడా’??
రాశికన్నా వాశి మిన్న అన్న విషయాన్ని నమ్మిన వ్యక్తి హీరో విక్టరీ వెంకటేష్. ఆయన తనవిజయాలనే తన పేరు ముందు పెట్టుకున్న 'విక్టరీ" మ్యాన్. చేసిన సినిమాలు తక్కువ అయినా పదికాలాలు గుర్తుండుపోయే సినిమాలు తీయాలని తపన పడే వ్యక్తి విక్టరీ వెంకటేష్. తన సుధీర్ఘ కెరీర్లో సాద్యమైనంత వరకూ ప్రతి చిత్రం కొత్తగా తీయాలని ప్రేక్షకులకు మంచి అనుభూతి మిగల్చాలని, కథ విషయం తగు జాగ్రత్త వహించి మరీ ఎన్నిక చేసుకొనే వెంకటేష్ తొలిసారిగా ఒక చారిత్రక వేషం వేయబోతున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వేంకటేష్ ని హీరోగా స్వామి వివేకానంద పాత్రలో రూపొందించబోతున్నారు.
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈ మధ్య ఆధ్యాత్మిక బాట పట్టారు. ఇంతకు ముందు నాగార్జునతో అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు కుటుంబ కథా చిత్రాలు కామెడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసిన వెంకటేష్ చారిత్రక వేషాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు స్వామి వివేకానంద క్యారెక్టర్ వేయనున్నారని ఫిలిం నగర్ వర్గాల కథనం. తొలిసారి ఆయన తన పంథామార్చుకున్నట్టు కనబడుతుంది. కొన్ని చారిత్రక వేషాలవైపు చూపు సారించినట్లు కనబడుతుంది. ఇప్పటికి ఇది నిర్దారణ కాకపోయినా చర్చల వరకు వచ్చిందని అన్నీ అనుకున్నట్లు జరిగి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళితే రాఘవేంద్రరావు కెరీర్ లోను వెంకటేష్ కెరీర్ లోను ఈ చిత్రం కలికితురాయిగా మిగులుతుందని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











