ఆ గర్వం పేరే ఎన్టీఆర్.. జీవితాంతం మా కుటుంబం రుణపడి ఉంటుంది.. విక్టరీ వెంకటేష్

తెలుగు జాతికి, తెలుగు వాడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు. కారణ జన్ముడిగా పేర్కొనే ఆయన శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో తెలుగు పరిశ్రమ నుంచి జయప్రద, జయసుధ, వెంకటేష్, ఆర్ నారాయణ మూర్తి, రాంచరణ్, నాగచైతన్య, సుమంత్, ఆదిశేషగిరిరావు, వినోద్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ..

నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలకు వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు. నాకు తెలిసినంత వరకు సినిమా పరిశ్రమకు, తెలుగు జాతికి నాయకుడిగా, కళాకారుడిగా ఆయన చేసిన సేవల గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. అలాంటి గొప్ప మనిషి శత జయంతి నాడు ఆయనను తలచుకొనే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని విక్టరీ వెంకటేష్ అన్నారు.

 Victory Venkatesh

ఎన్టీఆర్ భౌతికంగా మన మధ్య లేరు కానీ.. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల మనస్సులో ఇంకా వినిస్తుందంటే.. అందుకు కారణం ఆయన గొప్ప మనసు. నన్ను ఎవరైనా మీరు ఏ భాష అని అడిగితే.. నేను తెలుగు వాడినని చెప్పుకొంటాను. తెలుగు వాడినని చెప్పే ప్రతీ సారి ఆ పలుకులో ఉండే గర్వం పేరే ఎన్టీఆర్. ఓ అద్బుతమైన వ్యక్తి మన జీవితాల్లో ఉండటం గర్వంగా భావించాలి అని విక్టరీ వెంకటేష్ చెప్పారు.


ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు. దేశానికి ఒక శక్తి లాంటి వారనే కథగా చెప్పుకోవాల్సిన జీవితం ఆయనది. నాకు సినిమాల్లో ఎన్టీఆర్‌తో నటించలేదనే కోరిక తీరలేదు. కానీ కలిసుందాం రా సినిమాలో గ్రాఫిక్స్‌లో ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేసినట్టు అవకాశం మా నాన్న గారు కల్పించారు. సురేష్ ప్రొడక్షన్స్‌ అంటే ఒక రాముడు భీముడు. అలాంటి గొప్ప సినిమా మా సంస్థకు అదించినందుకు మా నాన్న గారు, మా ఫ్యామిలీ రుణపడి ఉంటాం అని వెంకటేశ్ అన్నారు.

తన ప్రసంగంలో ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదు అని వెంకటేష్ అనగానే.. బాలకృష్ణ వెంటనే ఏమిటి బాసు అలా మాట్లాడుతున్నావు. మీకు మాట్లాడే అర్హత ఉంది అంటూ చమత్కరించారు. వెంకటేష్ స్పీచ్ ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X