జూ ఎన్టీఆర్ ని అర్థిస్తు విక్టరీ వెంకటేష్
యంగ్ టగైర్ జూ ఎన్టీఆర్ కథానాయకుడుగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం హైద్రబాద్ లో చివరి షెడ్యూల్ జరుపుకొంటోంది. ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్టుగా అన్ని వర్గాలనూ ఆకర్షించే కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న మరో సెన్సేషన్ చిత్రం ఇది. ఏకథాటిగా నెలాఖరు వరకూ జరిగే ఈ షెడ్యూల్ తో ఒక పాట మినహా షూటింగ్ ని పూర్తి చేసుకొబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా విడుదలై చాలా రోజులు కావడంతో ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో సినిమా విడుదలవుతుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ 'అదుర్స్" డిసెంబర్ 15 వ తారీఖున విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే హీరో వెంకటేష్ అన్న సురేష్ బాబు తనయుడు రానా హీరోగా పరిచమవుతున్న సినిమా డిసెంబర్ 24న విడుదలకు సిద్దం చేసుకొన్నారు. ఈ నేపధ్యంలో వెంకటేష్ జూ. ఎన్టీఆర్ కి ఫోను చేసి తన సినిమా విడుదల తేదిని మార్చుకోవాల్సిందిగా కొరాడట. వెనువెంటనే సినిమాలు విడుదలైతే క్లాష్ అవుతుందని వెంకీ చెప్పాడట. డిసెంబరులో తన అన్న తనయుడు సినిమా విడుదలవుతుంది కాబట్టి 'అదుర్స్" ని ముందుగా కానీ లేక లేటుగా కానీ విడుదలకు ప్లాన్ చేసుకోవాలని కోరాడట. మరి వెంకీకి ఎన్టీఆర్ వైపు నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











