పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో విక్టరీ వెంకటేష్...!
'ప్రేమించుకుందాం రా"కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతోంది. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా త్వరలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాకి సంబంధించి వెంకీ జయంత్ ల మధ్య ఒప్పందం కూడా కుదిరిపోయిందట. రేపో మాపో సినిమా గురించిన ప్రకటన వెంకటేష్, జయంత్ కలసికట్టుగా చేయనున్నట్టు సమాచారం.
తీన్ మార్" సినిమా అంచనాల్ని అందుకోలేకపోయినా, జయంత్ డైరెక్టర్ గా మళ్ళీ లైమ్ లైట్ లోకొచ్చాడనే చెప్పాలి. చిన్న చితకా సినిమాలతో సరిపెట్టుకొంటోన్న దశలో పవన్ 'తీన్ మార్" సినిమాతో జయంత్ టాలీవుడ్ లో హల్ చల్ చేసిన సంగతి తెల్సిందే. 'తీన్ మార్" సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే వెంకీకి జయంత్ ఓ కథ చెప్పాడనీ, ఆ కథతో సినిమా చేయడానికి వెంకీ రెడీ అయ్యాడనీ తెలుస్తోంది. అయితే, 'తీన్ మార్" సినిమా రిజల్ట్ తర్వాత వెంకీ కాస్త వెనక్కి తగ్గినా, జయంత్ కాన్ఫిడెంట్ గా వున్నానని చెప్పడంతో వెంకీ ఆ ప్రాజెక్ట్ ని ఓకే చేశాడట.యాక్షన్ మిక్డ్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా ఈ చిత్రం వుండబోతోందిట. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.


Click it and Unblock the Notifications











