twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అజ్ఞాతవాసి'లో భారీ మార్పులు-చేర్పులు: 12ని. కత్తెర?, వెంకీ స్టిల్స్ అదిరిపోయాయి..

    |

    Recommended Video

    'అజ్ఞాతవాసి'లో భారీ మార్పులు-చేర్పులు.. వెంకీ స్టిల్స్ అదిరిపోయాయి..!

    'అజ్ఞాతవాసి'పై అభిమానులవి ఎన్నెన్ని అంచనాలో. అన్నీ బోల్తా కొట్టేశాయి. ఆ అంచనాల్లో సగం అందుకున్నా వాళ్లలో ఇంత నిరాశ ఉండేది కాదేమో!. మొత్తానికి త్రివిక్రమ్ చాలా దారుణమైన దెబ్బేశాడనే బాధలో పవన్ అభిమానులు ఉన్నారు. ఆ లోటును కాస్తయినా భర్తీ చేయడానికా? అన్నట్లు ఇప్పుడు 'అజ్ఞాతవాసి'కి మార్పులు-చేర్పులు జరగబోతున్నాయి.

    పవన్-వెంకీ ట్రాక్:

    పవన్-వెంకీ ట్రాక్:

    నిజానికి పవన్-వెంకీ ట్రాక్ సినిమాలో ఉండి ఉంటే కాస్తయినా సినిమాకు హెల్ప్ అయ్యేదని త్రివిక్రమ్ పునరాలోచనలో పడ్డారేమో!. అందుకే ఇప్పుడు 'అజ్ఞాతవాసి'కి తిరిగి ఆ ట్రాక్ చేర్చబోతున్నారు. ఇప్పటికే సినిమాకు పూడ్చలేనంత డ్యామేజ్ జరగడంతో.. ఈ ట్రాక్ కొంతలో కొంతైనా ఊరట కలిగిస్తుందేమో అని భావిస్తున్నారు.

    తెరపై 'థౌజండ్ వాలా' పేలాల్సిందే: అజ్ఞాతవాసిలో మరో అజ్ఞాతవాసి.. ఊహించని గెటప్‌లోతెరపై 'థౌజండ్ వాలా' పేలాల్సిందే: అజ్ఞాతవాసిలో మరో అజ్ఞాతవాసి.. ఊహించని గెటప్‌లో

     అలా అనుకున్నారట:

    అలా అనుకున్నారట:

    'అజ్ఞాతవాసి' సినిమాపై తొలి నుంచి ధీమాగా ఉన్న పవన్-త్రివిక్రమ్.. వెంకీ కామెడీ ట్రాక్ ను తర్వాత యాడ్ చేద్దాంలే అనుకున్నారట. సినిమా విడుదలై ఎలాగూ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది కాబట్టి.. సంక్రాంతికి 'వెంకీ' సీన్స్ యాడ్ చేస్తే కలెక్షన్స్ జోరు పెరుగుతుందని భావించారట. కానీ వాళ్ల అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి.

     'వెంకీ'పైనే ఆశలు?:

    'వెంకీ'పైనే ఆశలు?:

    'అజ్ఞాతవాసి' పరాభవం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను కోలుకోలేని దెబ్బతీసేదిగా మారింది. ఆ పరిస్థితి నుంచి కాస్తయినా గట్టెక్కాలంటే నిలకడగా కలెక్షన్స్ రావాల్సి ఉంటుంది. వెంకీ సీన్స్ యాడ్ చేయడం ద్వారా థియేటర్లకు ప్రేక్షకులను మళ్లీ రప్పించవచ్చు అని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    'అజ్ఞాతవాసి' ప్లస్&మైనస్: త్రివిక్రమ్ ఎక్కడ తగ్గాడు.. ఎక్కడ నెగ్గాడు!'అజ్ఞాతవాసి' ప్లస్&మైనస్: త్రివిక్రమ్ ఎక్కడ తగ్గాడు.. ఎక్కడ నెగ్గాడు!

    'వెంకీ' స్టిల్స్ విడుదల:

    'వెంకీ' స్టిల్స్ విడుదల:

    పవన్-వెంకీ కామెడీ ట్రాక్ సినిమాను ఎంతమేర గట్టెక్కిస్తుందో తెలియదు కానీ.. చిత్ర యూనిట్ మాత్రం భారీ ఆశలే పెట్టుకుంది. అందుకే, దీనికి సంబంధించిన పబ్లిసిటీపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. శుక్రవారం ఓ వీడియో ద్వారా 'వెంకీ' సీన్స్ యాడ్ చేయబోతున్నట్లు ప్రకటించిన నిర్మాతలు.. తాజాగా కొన్ని స్టిల్స్ విడుదల చేశారు.

     ఆకట్టుకునే స్టిల్స్:

    ఆకట్టుకునే స్టిల్స్:

    సినిమాలో పవన్-వెంకీ సన్నివేశాలకు సంబంధించిన మూడు స్టిల్స్ తాజాగా విడుదల చేశారు. వెంకీ పేపర్ చదువుతుంటే.. పవన్ కల్యాణ్ ఏదో అనడం.. వెంటనే ఆయన నుంచి రియాక్షన్ రావడం స్టిల్స్‌లో గమనించవచ్చు. మొత్తానికి వీరిద్దరి మధ్య నడిచే ట్రాక్ ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందన్న ధీమాతో ఉంది చిత్ర యూనిట్.

    12ని. లేపేసి.. 7ని. చేర్చి:

    12ని. లేపేసి.. 7ని. చేర్చి:

    ఇక సినిమాలో సాగదీత ఎక్కువైందన్న విమర్శలు రావడంతో కత్తెరకు కూడా పనిచెప్పబోతున్నారట. దాదాపు 12నిమిషాల నిడివి గల సీన్స్ ను సినిమా నుంచి కత్తిరించేయబోతున్నారట. ఆ స్థానంలో కొత్తగా 7నిమిషాల 26సెకన్ల నిడివి గల సీన్లను చేర్చబోతున్నారట. ఇందులోనే వెంకీ ట్రాక్ కూడా ఉంటుందని చెబుతున్నారు.

    English summary
    There was much ado about Venkatesh's cameo in Agnyaathavaasi. But Venky is missed in the movie. Producers are now planning to add those scenes to the movie. Recently released Venky stills also.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X