Saindhav Teaser: సైంధవ్ టీజర్ కు ముహూర్తం ఫిక్స్, ఎప్పుడు రిలీజ్ చేయనున్నారంటే?

Saindhav Teaser: టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబోలో రాబోతున్న తాజా చిత్రం సైంధవ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు చిత్రబృందం వెల్లడిస్తూనే ఉంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, గ్లింప్స్ ను చూస్తుంటేనే సైంధవ్ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రబృందం మరో అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది. ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు సినిమా నుంచి పెద్ద అప్ డేట్ రాబోతుందంటూ ప్రకటించింది. అందులో ఏముందంటే..?

ఈరోజు డైరెక్టర్ శైలేష్ కొలను ఇచ్చిన అప్ డేట్ లో సైంధవ్ సినిమాకు సంబంధించిన టీజర్ ను అక్టోబర్ 16వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. చంద్రప్రష్టనగరం ప్రతిష్టాత్మకమైన మిషన్ తో మీకోసం ఎదురు చూస్తోందని అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ పోస్టర్ లో విక్టర్ వెంకటేష్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. చేతిలో గన్ పట్టుకొని వైల్డ్ లుక్ తో అభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Victory Venkatesh Saindhav Movie Teaser Date announced

వెంకటేష్ హీరోగా రాబోతున్న 75వ సినిమా సైంధవ్ ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అలాగే వెంకీ మామ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాలో జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా... రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా జయప్రకాష్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్ ఈ సినిమాలో విలన్ గా.. విక్టరీ వెంకటేష్ ను ఢీకొట్టబోతున్నారు. అలాగే తమిళ హీరో ఆర్య కూడా ఓ సినిమాలో కీలక పాతర్ పోషించబోతున్నట్లు తలుస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్ సైంధవ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తుండగా... కిషోర్ తాళ్లూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ మణికంధన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా... గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ పనులు చూసుకుంటున్నారు. చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో సాగే సీక్రెట్ మిషన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది.

Victory Venkatesh Saindhav Movie Teaser Released on OCtober 16th

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన గ్లింప్స్ అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేయగా.. అనూహ్య స్పందన వచ్చింది. ఇప్పుడు టీజర్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించగా.. వెంకీ అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు. చూడాలి మరి టీజర్ ఏ రేంజ్ లో ఉంటుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X