Saindhav Movie: గుంటూరు కారం థియేటర్లు లాగేసుకుందా?.. విక్టరీ వెంకటేష్ రియాక్షన్ ఏంటంటే?
ఇటీవలే 2023కి గుడ్ బై చెప్పేసి 2024కు వెల్ కమ్ చెప్పేశాం. ఈక్రమంలోనే ఈ ఏడాది అలరించేందుకు అనేక చిత్రాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతికి ఎన్నెన్నో అద్భుతమైన పెద్ద చిత్రాలు థియేటర్ల వద్ద సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగులోనే 5 పెద్ద చిత్రాలు రాబోతున్నాయి. విక్టరీ వెంకటేష్, మన్మథుడు నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు, తేజ సజ్జా, మాస్ మహారాజా రవితేజ సినిమాలు రాబోతున్నాయి. అయితే ఎవరి సినిమాపై వారికి ఉన్న నమ్మకంతో ఎంత పోటీ ఉన్నా సరే వెనక్కి తగ్గకుండా రచ్చ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు మొత్తం 7 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో 12వ తేదీ రోజే.. గుంటూరు కారం, హనుమాన్, కెప్టెన్ మిల్లన్, అయలాన్, మేరీ క్రిస్మస్ లు వస్తున్నాయి. ఆ తర్వాతి రోజు సైంధవ్, ఈగల్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక చివరి రోజు అంటే 14వ తేదీ రోజు నా సామి రంగా సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈక్రమంలోనే ఎవరికి వారు తమ సినిమాలకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసుకుంటూ ప్రమోషన్లు చేసుకుంటున్నారు.
Recommended Video


తాజాగా విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ శైలేష్ కొలనులు కూడా తమ సైంధవ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈక్రమంలోనే అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎవరినీ నొప్పించకుండా తమ సినిమా అందరికీ రీచ్ కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఇంటర్వ్యూయర్లు అడిగే అనేక ప్రశ్నలకు చాలా తెలివిగా సమాధానం చెప్పారు. మీ చిన్నోడు మహేష్ బాబు.. గుంటూరు కారం సినిమాతో వచ్చి థియేటర్లు అన్నీ లాగేసుకుంటున్నాడు కదా.. దానికి మీరేం అంటారని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా.. వెంకటేష్ అదిరిపోయే సమాధానం చెప్పారు.
నేనేమీ ఫీలవ్వను.. ఇచ్చినవి తీసుకుంటాను.. ఎక్కడ రిలీజ్ అవుతుందో అక్కడే చూస్తాము అంటూ చాలా కూల్ గా సమాధానం చెప్పుకొచ్చాడు దగ్గుబాటి వెంకటేష్. అందరూ హ్యాపీగా బాగుండాలని కూడా కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అన్నా, తమ్ముళ్లు రెండు రోజుల్లో ఒక్కొక్కరుగా వస్తున్నారనే ఫీలింగే చాలా సూపర్ గా అనిపిస్తోందని పేర్కొన్నాడు. సంక్రాంతికి రాబోయే అన్ని సినిమాలు చాలా డిఫరెంట్ డిఫరెండ్ జోనర్ లో ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రేక్షకులు అన్నింటిని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నట్లు వెంకటేష్ చెప్పుకొచ్చారు.

సైంధవ్ సినిమా వెంకటేష్ కు 75వది కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అదిరిపోయే కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుందని ఈరోజు విడుదల అయిన ట్రైలర్ చూస్తుంటేనే అర్థం అవుతోంది. సైంధవ్ సినిమాలో వెంకటేష్ సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నవాజుద్దీన్ సిధ్దిఖి విలన్ గా మెప్పించబోతున్నారు. చూడాలి మరి జనవరి 13వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుంది అనేది.


Click it and Unblock the Notifications











