»   » సల్మాన్‌ గర్ల్‌ఫ్రెండ్‌తో చిక్కిన వెంకటేశ్.. ముంబైలో ఒకేకారులో..

సల్మాన్‌ గర్ల్‌ఫ్రెండ్‌తో చిక్కిన వెంకటేశ్.. ముంబైలో ఒకేకారులో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

విక్టరీ వెంకటేశ్ వివాదాలకు, గాసిప్స్‌కు ఎప్పుడూ దూరంగా ఉంటాడు. సుమారు మూడు దశాబ్దాల కెరీర్‌లో ఎన్నడూ సినీ పరిశ్రమలో రూమర్లు రాలేదు కూడా. కానీ ముంబైలో సల్మాన్ ఖాన్ గర్ల్‌ఫ్రెండ్ అని ప్రచారమవుతున్న ఐలియా వాంటర్‌తో ఒకే కారులో కనిపించడం మీడియాలో చర్చనీయాంశమైంది. ముంబైలో వాంటర్‌తో వెంకటేశ్ కలిసి వెళ్తూ ఆదివారం మీడియా కంటపడటం జరిగింది. వీరి కలయికపై అనేక భిన్న కథనాలు, వార్తలు వినిపిస్తున్నాయి.

వెంకీ మళ్లీ బాలీవుడ్ బాట

వెంకీ మళ్లీ బాలీవుడ్ బాట

వెంకటేశ్ హిందీలో చంటి రీమేక్ అనారీ (1993) చిత్రంలో నటించాడు. ఆ తర్వాత యమలీల రీమేక్‌ అయిన తఖ్దీర్‌వాలా అనే రెండో బాలీవుడ్ సినిమా చేశాడు. అప్పటి నుంచి మరో హిందీ సినిమాలో నటించిన దాఖలాలు లేవు. కేవలం టాలీవుడ్‌కే పరిమితమయ్యాడు. ప్రస్తుతం ప్రేక్షకుల్లో వచ్చిన మార్పుల పరిస్థితులకనుగుణంగా ఓ హిందీ సినిమా చేయాలని భావిస్తున్నాడట. ఓ సినిమాకు సంబంధించిన కథా చర్చల్లో వెంకీ పాల్గొన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇవన్నీ చర్చల దశలోనే ఉన్నాయని, ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలో బాలీవుడ్‌లో వెంకీ మళ్లీ దర్శనమిచ్చే అవకాశం ఉంది.

సల్మాన్‌తో కలిసి మల్టీ స్టారర్

సల్మాన్‌తో కలిసి మల్టీ స్టారర్

అయితే సల్మాన్ ఖాన్‌తో కలిసి మల్టీ స్టారర్ చేస్తున్నాడా? లేక సల్మాన్ బ్యానర్‌పై మరో సినిమా చేస్తున్నాడా అనే ఊహాగానాలకు తాజా పరిస్థితి అద్దం పట్టింది. గత ఏప్రిల్‌లో సల్మాన్ కలిసి నటించనున్నానని ఓ సందర్భంలో వెంకీ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్‌లో అబ్బాయి దగ్గుబాటి రానాకు మంచి పట్టు ఉంది. బాహుబలి తర్వాత రానాకు మరింత క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్ సినిమా చేయడానికి ఎక్కువ అవకాశాలు ఏర్పడ్డాయి.

కథా చర్చల్లో వెంకీ సినిమా

కథా చర్చల్లో వెంకీ సినిమా

సూపర్ స్టార్ సల్మాన్‌‌తో టాలీవుడ్ స్టార్లకు మంచి పరిచయాలు ఉన్నాయి. గతంలో సల్మాన్ నాకు సోదరుడి లాంటి వాడు అనే వెంకటేష్ చెప్పిన సంగతి తెలిసిందే. వీలైతే తాము ఇద్దరం కలిసి ఓ చిత్రం చేస్తాం అని చెప్పారు కూడా. అయితే బాలీవుడ్ సినిమా వర్కవుట్ కాకపోవడంతో వెంకటేశ్ కల అలానే ఉంది. ప్రస్తుతం అదే విషయంపై సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తున్నది.

వాంటర్‌, సల్మాన్‌తో పార్టీ

వాంటర్‌, సల్మాన్‌తో పార్టీ

కథా చర్చల్లో భాగంగా వెంకటేశ్ ఇటీవల ఓ స్పాలో సల్మాన్‌తో కలిసి ఐలియా వాంటర్‌ సమావేశమయ్యారట. ఆ పార్టీలో పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా ఉన్నారనేది తాజా సమాచారం. పార్టీ ముగిసిన తర్వాత రుమేనియాకు చెందిన గాయని వాంటర్‌తో వెళ్తూ వెంకటేశ్ ఇలా కనిపించడం విశేషంగా మారింది. అంతేకాకుండా వెంకటేశ్ నటించే హిందీ సినిమాలో వాంటర్ కూడా నటించనున్నారనే ప్రచారం బాలీవుడ్‌లో సాగుతున్నది.

English summary
Pictures of Venkatesh Daggubati and Salman Khan's rumoured girlfriend, Iulia Vantur, getting into the same car outside a Mumbai spa sent us into a tizzy on Sunday. Tollywood superstar was there to explore possibilities of acting in a Bollywood film. if Venkatesh is in talks to act in a Salman-starrrer but being spotted with Iulia does make one wonder if the Romanian actress-singer will make her acting debut with this project, as is being speculated.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more