నాని లాంటి నేచురల్ స్టార్ మన ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్వపడాలి: వెంకటేష్
నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జెర్సీ'. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వెంకటేష్, నాని క్రికెట్ ఆడి సభికులను అలరించారు. నాని బౌలింగ్ చేయగా వెంకీ బ్యాటింగ్ చేస్తూ బంతిని ప్రేక్షకుల వైపు కొడుతూ వారిలో మరింత ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.

ఇక్కడకు రావడం వెనక జెన్యూన్ రీజన్ ఉంది
నాకు క్రికెట్ ఇష్టం కాబట్టి ఈ వేడుకకు రాలేదు. ఇక్కడకు రావడం వెనక జెన్యూన్ రీజన్ ఉంది. ‘జెర్సీ' ఫస్ట్ లుక్ చూసినప్పటి నుంచే ఇంప్రెస్ అయ్యాను. డైరెక్టర్ గౌతమ్ తాను ఏం చెప్పాలనుకున్నాడో ఈ సినిమా ద్వారా స్పష్టంగా చెప్పబోతున్నట్లు అనిపించింది. ట్రైలర్ చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించిందని వెంకీ చెప్పుకొచ్చారు.

ఇలాంటి క్యారెక్టర్లలో ఇన్వాల్వ్ అయినపుడు ఎమోషనల్ అయిపోతాం
ఇలాంటి జెన్యూస్ మూవీస్ చాలా అరుదుగా వస్తాయి. ఇలాంటి క్యారెక్టర్లలో ఇన్వాల్వ్ అయినపుడు ఎమోషనల్ అయిపోతాం. ట్రైలర్ చూడగానే ఇన్స్‌స్పిరేషనల్, మోటివేషనల్, హీరో క్యారెక్టర్లో నెవర్ గివ్ అప్ ఉన్నట్లు కనిపించిందన్నారు.

ఇది కేవలం సినిమా కాదు
ప్రతి ఒక్కరూ జీవితంలో స్ట్రగుల్ అవుతారు. ఈ మూవీ చూసిన తర్వాత ఇది కేవలం సినిమా కాదు. అందరికీ ఒక లైఫ్ లెస్సన్ అనిపిస్తుంది. ఎన్నో విషయాలు నేర్పుతుంది. నీ గోల్ రీచ్ కావాలంటే ఏం చేయాలనే మోటివేసన్ ఇస్తుందని తెలిపారు.

నాని లాంటి నేచురల్ స్టార్ మన ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్వపడాలి
నానితో పాటు ఈ సినిమా టీంకు కంగ్రాట్స్. నాని అష్టాచెమ్మ దగ్గర నుంచి ఎదుగుతూ వచ్చాడు. అభిమానులు గర్వంగా ఫీలవ్వాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ నాచురల్ యాక్టర్. ఇలాంటి స్టార్ మన పరిశ్రమలో ఉన్నందుకు గర్వంగా ఉందని వెంకీ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











