twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేనే రాజు నేనే మంత్రిలో వేలుపెట్టిన వెంకటేష్.. ఏమౌతుందో ఏమో

    టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేశ్‌ది ప్రత్యేకమైన వ్యక్తిత్వం. తెర మీద తప్ప బయట ఎక్కడ కనిపించడదు. సినిమా ఒప్పుకొంటే ఆ చిత్ర కథలో గానీ, షూటింగ్‌లో గానీ జోక్యం చేసుకోడు అనే పేరున్నది. కానీ సొంత ప్రొడక్షన్‌లో

    By Rajababu
    |

    టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేశ్‌ది ప్రత్యేకమైన వ్యక్తిత్వం. తెర మీద తప్ప బయట ఎక్కడ కనిపించడదు. సినిమా ఒప్పుకొంటే ఆ చిత్ర కథలో గానీ, షూటింగ్‌లో గానీ జోక్యం చేసుకోడు అనే పేరున్నది. కానీ సొంత ప్రొడక్షన్‌లో రానా దగ్గుబాటి కోసం నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇటీవల కాలంలో అనేక పరాజయాలతో సతమతమవుతున్న తేజ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్‌లో వెంకటేష్ జోక్యం చేసుకొంటున్నారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    వడ్డీ వ్యాపారిగా రానా

    వడ్డీ వ్యాపారిగా రానా

    నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా వడ్డీ వ్యాపారిగా నటిస్తున్నాడు. రాధ పాత్రలో కాజల్.. రానాకు భార్యగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అనంతపురానికి చెందిన వ్యక్తిగా రానా కనిపించనున్నారు. ఓ వడ్డీ వ్యాపారి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏమున్నదనే ఈ చిత్ర కథ.

    Recommended Video

    Bigg Boss Telugu : Sameer Got Eliminated By Rana Daggubati
    ఇప్పటికే డైలాగ్స్‌కు విశేష స్పందన..

    ఇప్పటికే డైలాగ్స్‌కు విశేష స్పందన..

    ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ స్క్రీన్‌ప్లే అందించగా.. లక్ష్మీ భూపాల్ మాటలు సమకూర్చారు. ఇప్పటికే ఈ చిత్రంలోని డైలాగ్స్ విశేష స్పందన లభిస్తున్నది. నేను తలచుకొంటే ఐదేళ్లలో సీఎం కుర్చి నా ముడ్డి కింద ఉంటుంది అనే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    జోరుగా ప్రచారం..

    జోరుగా ప్రచారం..

    రానా దగ్గుబాటి సొంత ప్రొడక్షన్‌లో నటిస్తున్నదున్న నిర్మాత సురేష్ బాబు చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంటున్నారు. రిలీజ్‌కు ముందు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల జోగేంద్ర యువ గర్జన పేరుతో ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌లోనూ ప్రచారం చేశారు రానా దగ్గుబాటి.

    కనిపించని వెంకటేష్

    కనిపించని వెంకటేష్

    జోగేంద్ర యువ గర్జన‌ కార్యక్రమానికి సురేష్ బాబు తనయులు రానా దగ్గుబాటి, అభిరామ్ దగ్గుబాటి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ కనిపించకపోవడంతో యాంకర్ బిత్తిరి సత్తి ఆరా తీశాడు. అందుకు రానా జవాబిస్తూ.. బాబాయ్ వెంకటేశ్ .. ప్రస్తుతం నేనే రాజు నేనే మంత్రి ఎడిటింగ్‌లో బిజీగా ఉన్నారు. అందుకే రాలేదని ఆయన చెప్పారు.

    ఎడిటింగ్ టేబుల్ వద్ద వెంకటేష్

    ఎడిటింగ్ టేబుల్ వద్ద వెంకటేష్

    బాబాయ్ వెంకటేష్‌కు యాక్టింగ్‌లోనే కాకుండా సినిమా పరిశ్రమలోని అన్ని విభాగాలపై పట్టు ఉందని అని ఓ ప్రశ్నకు రానా జవాబిచ్చారు. సినిమాను పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు, అభిమానులకు నచ్చే విధంగా చర్యలు తీసుకొంటున్నారని ఆయన పేర్కొన్నారు. అన్న కుమారుడి కంటే రానాను వెంకటేస్ స్నేహితుడిగా భావిస్తాడని చెప్పుకొంటారు.

    సురేష్ ప్రొడక్షన్ స్థాయిలో..

    సురేష్ ప్రొడక్షన్ స్థాయిలో..

    పరిశ్రమకు ఎన్నో ఘన విజయాలను అందించిన సురేష్ ప్రొడక్షన్ సంస్థ నుంచి నేనే రాజు నేనే మంత్రి వస్తున్నందున ఓ గొప్ప చిత్రంగా మలచాలని అందరూ కష్టపడుతున్నారని మాట ఫిలింనగర్‌లో వినిపిస్తున్నది. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతీ ఒక్కరు సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    పోటాపోటీగా మూడు సినిమాలు..

    పోటాపోటీగా మూడు సినిమాలు..

    ఆగస్టు 11న రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేనే రాజు నేనే మంత్రి చిత్రం ఇతర సినిమాల నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నది. ఓకే రోజున టాలీవుడ్‌లో మూడు చిత్రాలు విడుదల కానున్నాయి. రానా సినిమాకు పోటీగా బోయపాటి సినిమా జయ జానకి నాయక, హీరో నితిన్ చిత్రం లై విడుదలకు ముస్తాబవుతున్నాయి. పోటాపోటీగా సినిమాలను రిలీజ్ చేయడంపై టాలీవుడ్‌లో అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    English summary
    After Baahubali, Ghazi movies, Rana Daggubati latest movie is Nene Raju Nene Mantri. First time Rana is working in his own Suresh production. This movie get good response from audience before release. Reports suggest that Hero Victory Venkatesh is taking care of movie at Editing table.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X