కాంగ్రెస్ పార్టీకి విక్టరీ వెంకటేష్ ప్రచారం.. ఖమ్మంలో రఘురాంరెడ్డికి మద్దతు ఎందుకంటే?

తెలుగు సినిమా రంగంలో సినీ తారలు తమకు నచ్చిన పార్టీలకు ప్రచారం చేయడానికి సిద్దమవుతున్నారు. అయితే ఎప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండే వెంకటేష్ ఈసారి కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేయడానికి రంగంలోకి దూకడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తున్నది. అయితే పక్కా తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ ఫ్యామిలీ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేయడం వెనుక ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

సినీ, రాజకీయ రంగంలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఎనలేని గుర్తింపు ఉంది. శత చిత్ర నిర్మాతగా డాక్టర్ డీ రామానాయుడు ఫిలిం ఇండస్ట్రీలో ఓ హిస్టరీ ఉంది. అంతేకాకుండా తెలుగు దేశం పార్టీలో ఆయన చేరి ఎంపీగా కూడా తన సేవలు అందించారు. 13వ లోక్‌సభకు బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి ఎంపికై 1999 నుంచి 2004 వరకు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారు.

Victory Venkatesh to Campaign Congress Party MP Candidate Ramasahayam Raghuram Reddy in Khammam

అయితే 14వ లోక్‌సభ ఎన్నికల్లో రామానాయుడు అనూహ్యంగా పరాజయం పొందారు. బాపట్ల నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయిలో అభివృద్ది చేసినప్పటికీ.. ఓటమి పాలవ్వడం జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి దగ్గుబాటి ఫ్యామిలీ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు.

అయితే అనూహ్యంగా వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న రామ సహాయం రఘురాంరెడ్డికి ప్రచారం చేయనున్నారు. మే 7వ తేదీన ఖమ్మం పట్టణం, లోక్‌సభ నియోజకవర్గంలో పర్యటించనున్నట్టు తెలుస్తున్నది. వెంకటేష్ ప్రచారం చేయడానికి కారణం రాఘురాంరెడ్డి తనకు వియ్యంకుడు కావడమే.

Victory Venkatesh to Campaign Congress Party MP Candidate Ramasahayam Raghuram Reddy in Khammam

అయితే రామసహాయం రఘురాంరెడ్డి విషయానికి వస్తే.. ఆయన ఉమ్మడి వరంగల్ లోక్‌సభ నియోజకర్గానికి సుదీర్ఘ కాలం ఎంపీగా సేవలందించిన రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు అనేది గమనార్హం. రఘురాంరెడ్డి పెద్ద కుమారుడికి వెంకటేష్ కూతురును ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన రెండో కుమారుడికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చిన్న కుమార్తెను ఇచ్చారు.

ఇలా బంధుత్వం కారణంగా వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న రఘురాంరెడ్డికి మద్దతు తెలిపారు. ఆయన విజయానికి ప్రచారం చేయనున్నారు అని తెలిసింది. ఇక హైదరాబాద్ రేస్ కోర్స్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబం చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి కారణంగా మళ్లీ తన వారసుడిగా రఘురాంరెడ్డిని బరిలోకి దించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X