twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఎఫ్2' ట్విట్టర్ రివ్యూ : వెంకీ కామెడీతో అదరగొట్టేశాడు.. ఫస్ట్‌హాఫ్‌కు తిరుగులేదు, కానీ!

    |

    Recommended Video

    F2 – Fun and Frustration Twitter Review ఎఫ్2 ట్విట్టర్ రివ్యూ | Filmibeat Telugu

    విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ఎఫ్ 2. సంక్రాంతి బరిలో చివరగా విడుదలవుతున్న చిత్రం ఇదే. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శత్వంలో, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. మిల్కి బ్యూటీ తమన్నా ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా నటించింది. అందాల తార మెహ్రీన్ వరుణ్ తేజ్ అల్లరి ప్రేయసిగా నటించింది. ట్రైలర్, టీజర్ లో చూపిన అంశాల ప్రకారం థియేటర్ లో ప్రేక్షకుల కు దర్శకుడు మంచి ఫన్ రైడ్ అందించబోతున్నాడనే విషయం అర్థం అవుతోంది. దేవిశ్రీ సంగీతం ఈ చిత్రంలో మరో ఆకర్షణ. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చూద్దాం!

    ఫస్ట్ హాఫ్ సూపర్ కూల్

    ఇప్పుడే ఎఫ్2 చూశా. మంచి హాస్య భరిత చిత్రం. లాజిక్కులు చూడొద్దు. కామెడీని ఎంజాయ్ చేయండి.. ఫస్ట్ హాఫ్ సూపర్ కూల్ అనిపించే విధంగా ఉంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం జస్ట్ ఒకే అనిపించే విధంగా ఉంది.

    ఫ్యామిలీతో వెళ్లి

    ఎఫ్2 చిత్రం విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు. ఫ్యామిలీతో వెళ్లి హాయిగా నవ్వుకునే చిత్రం ఇది. ఎఫ్2 చిత్రం సంక్రాంతి విజేత. ఇప్పటికే మూడు బడా చిత్రాలు సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యాయి.

    పొంగల్ బంపర్ హిట్

    ఇప్పుడే ఎఫ్2 చిత్రం చూశా. సినిమా మొత్తం ఫన్ అద్భుతంగా ఉంది.నాకు చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కు వినోదాన్ని అందించిన పొంగల్ బంపర్ హిట్ గా నిలుస్తుంది. ఎఫ్2 టీం మొత్తాన్ని అభినందించాలి. ఈ అద్భుతమైన కామెడీ చిత్రంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించండి.

    సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే

    ఓవర్సీస్ రిపోర్ట్స్ ప్రకారం ఎఫ్2 చిత్ర ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. సెకండ్ హాఫ్ ఓకె అనిపించే విధంగా ఉంది. ఓవరాల్ గా ఎఫ్2 హిట్ మూవీ.

    బిలో యావరేజ్ చిత్రం

    ఎఫ్2 చిత్రం కంప్లీట్ గా వెంకటేష్ శైలి సాగే చిత్రం. ఇందులో ఫస్ట్ హాఫ్ కొంతవరకు బాగానే ఉంది. కానీ చిత్రం ఆశించిన స్థాయిలో లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం నిలబడే అవకాశాలు లేవు. ఓవరాల్ గా ఇది బిలో యావరేజ్ సినిమా.

    హైలైట్స్ ఇవే

    తొలి అర్థ భాగంలో వచ్చే ఫన్ సన్నివేశాలు, విక్టరీ వెంకటేష్ కామెడీ ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచే అంశాలు. ఇక దర్శకుడు ఎంచుకునే స్టోరీ లైన్, సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్రస్టేషన్ సన్నివేశాలు మైనస్ గా చెప్పుకోవచ్చు.

    ఇది వెంకీ షో

    ఎఫ్2 చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్. పొంగల్ కు ఇది పర్ఫెక్ట్ చిత్రం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వెంకీ షో. ఫ్యామిలీ ఆడియన్స్ టికెట్స్ కోసం క్యూ కడతారు.

    సెకండ్ హాఫ్ లో బలవంతంగా

    ఫస్ట్ హాఫ్ లో ఫన్.. సెకండ్ హాఫ్ లో ఫస్ట్రేషన్. ఎఫ్2 చిత్రంలో ఫస్ట్ హాఫ్ మొత్తం పవర్ ప్యాక్డ్ కామెడీతో కొనసాగుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో జోరు కొనసాగలేదు. బలవంతగా కామెడీని చొప్పించారు. కొంత సాగదీశారు కూడా. మొత్తంగా ఇది అబౌ యావరేజ్ చిత్రం. బాక్సాఫీస్ వద్ద రాణించే అవాకాశాలు ఉన్నాయి.

    సంగీతం ఎలా ఉందంటే

    ఫస్ట్ హాఫ్ లో వెంకటేష్ పెర్ఫామెన్స్, కామెడీ చాలా బావున్నాయి. కానీ పాటలు, బ్యాగ్రౌండ్ సంగీతం సరిగా లేదు. ఇప్పటి వరకు సినిమా చాలా బాగా ఎంటర్ టైన్ చేసింది. సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్.

    డాన్స్ అదరగొట్టారు

    ఫస్ట్ హాఫ్ లో ఫన్, సెకండ్ హాఫ్ లో ఫ్రస్టేషన్. ఎఫ్2 కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. వెంకీ నటన ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ. వెంకటేష్, వరుణ్ తేజ్ డాన్సులతో ఆకట్టుకున్నారు. సెకండ్ హాఫ్ ఓకె. సంక్రాంతికి ఇది హిట్ మూవీ.

    English summary
    Victory Venkatesh and Varun Tej F2 movie Twitter review
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X