twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బిగ్ బాస్’ శివ బాలాజీ బర్త్ డే పార్టీలో రచ్చ రంబోలా... (వీడియో)

    బిగ్ బాస్ విన్నర్ శివ బాలాజీ పుట్టినరోజు వేడుక ఇటీవల హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శివ బాలాజీ డాన్స్ చేశారు.

    By Bojja Kumar
    |

    బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ విన్నర్ శివ బాలాజీ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలో ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు. బిగ్ బాస్ విజయంతో డబ్బుతో పాటు పాపులారిటీ సొంతం చేసుకున్న శివ బాలాజీ ఈ సారి పార్టీని ఎన్నడూ లేనంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.

    తన పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను శివ బాలాజీ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేశాడు. భార్య మధుమితతో కలిసి డ్యాన్స్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    సరదాగా డాన్స్ చేస్తూ

    సరదాగా డాన్స్ చేస్తూ

    నీకు మనసిస్తా అనే సాంగుకు శివ బాలాజీ, మధుమిత కలిసి డాన్స్ చేశారు. పార్టీకి హాజరైన స్నేహితులు, సన్నిహితులు వారిని ఎంకరేజ్ చేయడంతో ఈ జంట మరింత జోష్‌తో స్టెప్పులేశారు.

    తొలి పుట్టినరోజు వేడుక

    తొలి పుట్టినరోజు వేడుక

    సినీ పరిశ్రమకు చెందిన కొలీగ్స్, స్నేహితులతో నేను చేసుకున్న తొలి పుట్టిన రోజు వేడుక ఇదే అని, ఇంతకు ముందు ఎప్పుడూ తాను ఇలా ఇండస్ట్రీ వారితో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోలేదని శివ బాలాజీ వెల్లడించారు. ఈ పార్టీకి వచ్చి తననే ఆశీర్వదించిన అందరికీ థాంక్స్ చెప్పారు.

    భార్య మీద ప్రేమ

    ‘నా భార్య మధుమితపై ఉన్న ప్రేమను నేను బాహాటంగా వ్యక్తం చేయలేను. నాకెందుకో అది సహజంగా అనిపించదు. నా కళ్ల ద్వారా, మనసు ద్వారా నా ప్రేమను తను అర్థం చేసుకుంటుంది' అని చెప్పిన శివ బాలాజీ ఓ వీడియో పోస్టు చేశారు.

    రావు రమేష్

    రావు రమేష్

    శివ బాలాజీ ఏర్పాటు చేసిన బర్త్ డే పార్టీలో ప్రముఖ నటుడు రావు రమేష్ తదితరులు

    సందడి చేసిన బాగ్ బాస్ కంటెస్టెంట్స్

    సందడి చేసిన బాగ్ బాస్ కంటెస్టెంట్స్

    శివ బాలాజీ ఏర్పాటు చేసిన బర్త్ డే పార్టీకి బిగ్ బాస్ షోలో పోటీదారులైన హరితేజ, అర్చన, సంపూ, ఆదర్శ్, కత్తి కార్తీక, మధుప్రియ, దీక్ష, ధనరాజ్ ఇలా అందరూ హాజరయ్యారు.

    భర్తతో హరితేజ

    భర్తతో హరితేజ

    భర్తతో కలిసి శివ బాలాజీ బర్త్ డే పార్టీకి హాజరైన బిగ్ బాస్ ఫైనల్ కంటెస్టెంట్ హరితేజ.

    కత్తి కార్తీక

    కత్తి కార్తీక

    శివ బాలాజీ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి కార్తీక.

    సంపూర్ణేష్ బాబు

    సంపూర్ణేష్ బాబు

    శివ బాలాజీ పుట్టినరోజు వేడుకలో సంపూర్ణేష్ బాబు

    గతంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో శివ బాలాజీ పెట్టినరోజు వేడుక జరిగింది.

    గతంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో శివ బాలాజీ పెట్టినరోజు వేడుక జరిగింది.

    నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్.... అంటూ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు షూటింగ్ సమయంలో శివ బాలాజీ పుట్టినరోజు నిర్వహించారు.

    ఫోటోస్ కోసం క్లిక్ చేయండిఫోటోస్ కోసం క్లిక్ చేయండి

    English summary
    "Dancing with my real life partner Madhumitha is the rarest thing i do ❤️ Expressing love towards her out loud, doesn’t come naturally to me but she understands it through my eyes, reads my mind and heart. #blessed" Shiva Balaji said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X