twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫన్ టైమ్‌: బ్రహ్మానందం ను ఇంటర్వూ చేసిన అఖిల్‌ ( వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: అక్కినేని కుటుంబంలో నటవారసుడిగా.. అఖిల్‌ తెరంగేట్రం చేస్తున్న చిత్రం 'అఖిల్‌'. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా చిత్రం ప్రమోషన్స్ ని ముమ్మరం చేసారు. ఆ ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ సరదాగా బ్రహ్మానందంను ఇంటర్వూ చేసారు. ఆ ఇంటర్వూని తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేసారు. ఆ వీడియోని ఇక్కడ చూసి ఎంజాయ్ చేయండి.

    Here's the interview! Had a blast doing this :)

    Posted by Akhil Akkineni on 12 October 2015

    అక్కినేని అఖిల్‌ను హీరోగా వెండి తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న చిత్రం 'అఖిల్‌'. ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు నితిన్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాటలను ఈ నెల 20న విడుదల చేసారు . ఈ సందర్బంగా ఈ చిత్రం ధియోటర్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.

    ఈ చిత్రానికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తుండగా, అనూప్‌ రూబెన్స్‌, థమన్‌ సంయుక్తంగా ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.

    అఖిల్‌ అక్కినేని మాట్లాడుతూ ''ప్రేక్షకుల్ని ఎలా సంతృప్తిపరచాలా అని ఎప్పుడూ ఆలోచిస్తుంటా. నా సినిమా పాటల విడుదల వేడుక గురించి ఒక చిన్న మాట చెప్పాలని మహేష్‌ని అడిగా. వేడుకకి నేనే వస్తా అన్నారు. చాలా సంతోషమనిపించింది. సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఒక గొప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తా అని చెప్పా. ఆ మాట నిజం చేయబోతున్నా. వినాయక్‌గారు ఇదివరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. అనూప్‌, తమన్‌లకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నయ్య, నేను బయట పెద్దగా మాట్లాడుకోం. కానీ నా గురించి వేదికలపై చాలా బాగా చెబుతుంటాడు. ఆ మాటల్ని చాలా ఇష్టపడుతుంటా'' అన్నారు.

    Video :Akhil interviews Brahmanandam

    వి.వి.వినాయక్‌ చెబుతూ ''ఒక సూపర్‌హిట్‌ సినిమా ఇస్తానని నాగార్జునగారికి మాటిచ్చా. ఆ మాటని నిలబెట్టుకోబోతున్నాం. సినిమా తీసినవాడిగా నేను చెబుతున్నా అఖిల్‌ తప్పకుండా సూపర్‌స్టార్‌ అవుతాడ''న్నారు.

    యాక్షన్ సీన్లు మాత్రమే కాదు...డాన్స్ విషయంలో అఖిల్ కేక పెట్టించబోతున్నాడు. టాలీవుడ్లో అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన నాగార్జున, నాగ చైతన్య మాత్రం తమ పోటీ స్టార్లతో పోలిస్తే డాన్స్ విషయంలో ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నారు. అయితే అఖిల్ అక్కినేని మాత్రం డాన్స్ విషయంలో ఇరగదీస్తుండటంపై ప్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. సినిమాలో అఖిల్ డాన్స్ స్టెప్పులు వేసిన వీడియో ఆ మధ్య లీకైంది కూడా.

    Video :Akhil interviews Brahmanandam

    శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

    English summary
    Akhil Akkineni tweeted:"It was an amazing experience working with the legend Brahmanandam garu who has made all of us laugh so much! I interviewed him on the sets "
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X