అనుష్క 'సైజ్‌ జీరో': సెక్సీ సాంగ్ (వీడియో)

By Srikanya

హైదరాబాద్‌: అనుష్క, ఆర్య ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'సైజ్‌ జీరో' . చిత్రం ప్రమోషన్ లో భాగంగా జీరో సైజ్ ..జీరో సైజ్ అనే సెక్సీ సాంగ్ ని యూనిట్ విడుదల చేసింది. ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. అనుష్క, ఆర్య, సోనాల్‌ చౌహాన్‌ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అక్టోబర్‌లో 'సైజ్‌ జీరో'ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఆ సాంగ్ వీడియోని ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘నేను లావుగా కనిపిస్తున్న లుక్ ఫేక్ కాదు. ఆ సినిమాకోసం నేను కార్బోహైడ్రేట్స్ తీసుకొని లావు అయ్యానని' అని అనుష్క తెలిపింది. 'సైజ్‌ జీరో' చిత్రంలో ఆమె లావుగా కనపడటం అబద్దమని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆమె టీవి 9 తో మాట్లాడుతూ ఇలా స్పందించింది. 17 కిలోలు ఆమె ఈ సినిమా కోసం పెరిగింది.

ఈ సినిమాలో అనుష్క రెండు విభిన్న షేడ్స్ లో కనిపించనుంది. దర్శ కేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు, ‘అనగనగా ధీరుడు' సినిమా దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. యం.యం.కీరవాణి సంగీత దర్శకుడు. ప్రసాద్ వి పోట్లురి నిర్మాత. ‘బాహుబలి', ‘రుద్రమదేవి' సినిమాల తర్వాత అనుష్క నటిస్తున్న మరో భారి బడ్జెట్ ఫాంటసీ సినిమా ఇది .

Video : Anushka's latest Size Zero size zero song

యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథ, కథనాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. కోవెలమూడి ప్రకాష్ భార్య ఈ నవలను రాసినట్లు తెలుస్తోంది.

ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా ఆర్యా, భరత్, ఉర్వసీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హీరోయిన్ శృతిహాసన్ గెస్ట్ రోల్ చేస్తున్నారు.

ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో షూటింగ్ చేస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి ప్రకాష్ కోవెలమూడి భార్య అయిన కనిన ధిల్లన్ కథ - స్క్రీన్ ప్లే అందించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X