For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఏడ్చేసిన బ్రహ్మానందం(వీడియో)

  By Srikanya
  |

  హైదరాబాద్: హాస్య నటుడు బ్రహ్మానందం, ఎమ్ ఎస్ నారాయణ అనుబంధం గురించి చెప్పక్కర్లేదు. ఈ నేఫధ్యంలో ఎమ్.ఎస్ నారాయణ మృతి చెందటంతో తట్టుకోలేకపోయారు. ఆయన భోరున ఏడ్చేసారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడండి.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఎమ్.ఎస్ నారాయణ గురించి....

  వెండితెరపై ఆయన మందుకొడితే.. థియేటర్‌లో ప్రేక్షకులకు కిక్కు వస్తుంది! ఆయన తూగుతూ డైలాగులు చెబితే.. ప్రేక్షకులు వూగుతూ నవ్వుతారు. తాగుబోతు పాత్రల్లో అంతలా ప్రేక్షకుల్ని అలరించిన నటుడు ఎమ్మెస్‌ నారాయణ. ఆయన నటించిన పాత్రల్లో సగానికిపైగా మందుబాబు పాత్రలే. అవే ఆయనకు పేరు, మనకు వినోదం అందించాయి.

  ఎమ్మెస్‌ నారాయణ అసలు పేరు మైలవరపు సూర్యనారాయణ. 1951 ఏప్రిల్‌ 16న పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో జన్మించారు. భాషా ప్రవీణ పూర్తిచేసి, సమీపంలోని వేండ్రలో గ్రేడ్‌-2 తెలుగు పండితునిగా పనిచేశారు. కళాశాల రోజుల్లో ఉన్నప్పుడే కళాప్రపూర్ణ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లాడారు.

  ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అధ్యాపకునిగా పనిచేసిన కళాశాలలోనే ఎమ్మెస్‌ చదువుకున్నారు. 1971లో పరుచూరి రాసిన 'సోషలిజం' నాటికలో కథానాయకుడి పాత్ర పోషించారు ఎమ్మెస్‌. 'ఉత్తమ నటుడు' బహుమతీ వచ్చింది. అక్కడి నుంచి ఆయన నాటకాల ప్రస్థానం మొదలైంది. ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. నాటకాలు రాయడం, నటించడం కొనసాగించారు. 1977లో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు 'జీవచ్ఛవం' అనే నాటిక రాసి, పిల్లలతో వేయించి నిధులు సమకూర్చారు. ఆ తర్వాత ఆయన దృష్టి సినిమా కథలపై పడింది. 'అలెగ్జాండర్‌', 'పేకాట పాపారావు', 'ప్రతిష్ఠ', 'అదిరింది గురూ', 'హాలో నీకూ నాకూ పెళ్లంట' ఇలా ఎనిమిది చిత్రాలకు కథలు అందించారు.

  Video: Brahmanandam breaks down

  రచయితగా కొనసాగుతున్న ఎమ్మెస్‌లో ఓ మంచి నటుడు ఉన్నాడని గుర్తించారు రవిరాజా పినిశెట్టి. ఆయనతో అంతకుమునుపే ఎమ్మెస్‌ నారాయణకు అనుబంధం ఉండేది. రవిరాజాకు 'సవ్యసాచి' కథను ఇచ్చారు ఎమ్మెస్‌. ఆ అనుబంధంతో రవిరాజా 'ఎమ్‌.ధర్మరాజు ఎమ్‌.ఎ.' చిత్రంలో చెవిటి వాడి వేషం ఇచ్చారు. అది ప్రేక్షకులకు నచ్చడంతో వరుసగా 'రుక్మిణి', 'పెదరాయుడు' వంటి ఏడు సినిమాల్లో నటించారు. మొదట్లో సినీ రంగంలో నిలదొక్కుకునేందుకు తీవ్ర ఆటుపోటులను ఎదుర్కొన్నారు ఎమ్మెస్‌. ఒక దశలో వెనక్కి వెళ్లిపోవాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని పలుసార్లు ఆయనే స్వయంగా వెల్లడించారు.

  కానీ, హాస్యం పండించడంలో తనదైన శైలిని ఏర్పరచుకున్న ఎమ్మెస్‌, వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. క్రమంగా సినిమా అవకాశాలు పెరగడంతో 1998లో లెక్చరర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తిస్థాయి నటుడిగా కొనసాగారు. 'రుక్మిణి'లో ఎమ్మెస్‌ నారాయణ చేసిన తాగుబోతు పాత్ర ఈవీవీ సత్యనారాయణకు నచ్చడంతో.. 'మా నాన్నకు పెళ్లి' చిత్రంలో అవకాశం ఇచ్చారు. నిజానికి ఇందులో ఆయనది మూడు సన్నివేశాల పాత్రే. కానీ ఎమ్మెస్‌ జోరు చూసి.. సన్నివేశాలు పెంచుకొంటూ వెళ్లారు. చివరికి ఆ చిత్రానికి ఎమ్మెస్‌ వినోదం ప్రధాన ఆకర్షణ అయింది. తుళ్లుతూ, తూలుతూ.. తాగుబోతుకు అచ్చమైన నిర్వచనంలా కనిపించారు.

  ఈ సినిమాతో ఎమ్మెస్‌ పేరు మార్మోగిపోయింది. నంది అవార్డు కూడా వచ్చింది. 'తాగుబోతు పాత్రకు నంది అవార్డు ఏమిటి?' అని ఓ పెద్దాయన హేళన చేస్తే... 'సినిమాల్లో నానా వెధవ్వేషాలేసే విలన్లకూ అవార్డులు ఇస్తున్నారు కదా' అని తనదైన శైలిలో చురక అంటించారాయన! అక్కడి నుంచి ఎమ్మెస్‌ జాతకం మారిపోయింది. 1998 జనవరి 9న ఏకంగా 27 సినిమాలను అంగీకరించారు. దాదాపు అన్నీ తాగుబోతు వేషాలే. సినిమాలో తాగుబోతు వేషం ఉంటే.. ఎమ్మెస్‌కే దక్కేది. పది సినిమాలు చేస్తే అందులో ఏడు తాగుబోతు వేషాలే. 'సార్‌... మీరు నిజంగానే తాగి నటిస్తారా?' అని చాలామంది ఎమ్మెస్‌ దగ్గరే సందేహం వెలుబుచ్చేవారు.

  కానీ.. 'నటన నాకు దైవం. సెట్‌కి వస్తే గుడికి వచ్చినట్టే. గుడిలోకి ఎవరైనా తాగి వెళ్తారా?' అంటూ సినిమా రంగంపై తనకున్న ప్రేమను బయటపెట్టేవారాయన. ఇప్పటివరకు 700కు పైగా చిత్రాల్లో నటించారు. తమిళంలోనూ 2 సినిమాలు చేశారు. 'కొడుకు', 'భజంత్రీలు' చిత్రాలతో మెగాఫోన్‌ పట్టారు. 'కొడుకు' చిత్రంతో ఆయన తనయుడు విక్రమ్‌ను కథానాయకునిగా వెండితెరకు పరిచయం చేశారు.

  ఆయన కుమార్తె శశికిరణ్‌ 'సాహెబా సుబ్రహ్మణ్యం' చిత్రంతో దర్శకురాలిగా చిత్రసీమలోకి అడుగుపెట్టారు. 'రామసక్కనోడు', 'సర్దుకుపోదాం రండి', 'శివమణి', 'దూకుడు' చిత్రాలకు ఉత్తమ హాస్యనటుడిగా నందిఅవార్డులు అందుకొన్నారు ఎమ్మెస్‌. 'కబడ్డీ కబడ్డీ' చిత్రంలో పాటపాడి గాయకునిగానూ గొంతు సవరించుకొన్నారు.

  English summary
  Brahmanandam said, "MS Narayana was one of my closest friends in the industry; in fact we were like brothers. When he was on his death bed, he called his daughter and took a piece of paper and wrote my name. He wanted to talk to me. I don't think I can cite a better example to explain the kind of relationship we shared.We used to meet quite often and have shared a lot of lunches and dinners."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X