ఆనందంతో బ్రహ్మానందం డాన్స్(వీడియో)
హైదరాబాద్ : కాకినాడలో కె.విశ్వనాథ్, బ్రహ్మానందం, తణికెళ్ల భరిణి లతో గోశాల ప్రారంభం జరిగింది. చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంతో ఈ గోశాల నిర్మాణం జరిగింది. భానుగుడి సెంటర్ నించి తిమ్మాపురం వరకూ పెద్ద ర్యాలీ జరిగింది. ఈ ఉత్సవంలో బ్రహ్మానందం ఆనందంతో డాన్స్ వేసారు. అంతేకాదు..తణికెళ్ల భరణి ... మాట్లాడారు. అదంతా ఎబిఎన్ ఛానెల్ వారు చిత్రీకరించారు. ఈ క్రింద ఆ వీడియోని చూడండి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇక బ్ర్హహ్మానందం కెరీర్ విషయానికి వస్తే...
ఇప్పటికే 950కిపైగా చిత్రాల్లో నటించిన ఆయన త్వరలో 1000 చిత్రాల మార్కును దాటబోతున్నారు. ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను నవ్విస్తూ...హాస్యానికి కొత్త ఒరవడితో కేవలం హావభావాతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం బ్రహ్మానందం ప్రత్యేకత. అత్యధిక చిత్రాలలో నటించిన నటుడిగా గిన్నిస్‌బుక్ రికార్డును సైతం అందుకున్న బ్రహ్మి కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్నారు అందుకున్నారు. ఇప్పటికీ ఈయన తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ఎక్కువ సినిమాలలో నటిస్తూ, ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హాస్య చక్రవర్తి.
కామెడీ కింగ్ బ్రహ్మానదం లేని తెలుగు పెద్ద సినిమా ఊహించలేని స్ధితికి వచ్చింది. ముఖ్యంగా కామెడీలు రాజ్యం ఏలుతున్న ఈ సమయంలో బ్రహ్మానందం రకరకాల గెటప్ లలో, పేర్లతో స్క్రీన్ పై నవ్వులు కురిపిస్తూ భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిస్తున్నాడు. మొన్నామధ్య నాయక్ చిత్రంలో జిలేబిగా కనిపించి, తర్వాత కిల్ బిల్ పాండేగా రేసుగుర్రంలోనూ... రీసెంట్ గా అల్లుడు శ్రీను చిత్రంలో డింపుల్ గా కనిపించిన బ్రహ్మానందం ఆ మధ్యన లౌక్యం... ఇప్పుడు సిప్పీగా మరోసారి నవ్వించారు.

ఈ సారి వీకెండ్ వెంకట్రావ్ గా రామ్ తాజా చిత్రం పండుగ చేస్కో లో కనిపించనున్నారని సమాచారం. ఈ పాత్ర కామెడీతో ఇరగ తీస్తుందని చెప్తున్నారు. గతంలో రామ్, బ్రహ్మానందంల కాంబినేషన్ లో వచ్చిన రెడీ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ పాత్రతో మరో సారి తన ట్రేడ్ మార్క్ ని చూపించి సినిమాకు ప్లస్ అవనున్నాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











