»   » ముద్దుల కూతురు డాన్స్ , చూస్తూండిపోయిన మహేష్ (వీడియో)

ముద్దుల కూతురు డాన్స్ , చూస్తూండిపోయిన మహేష్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేష్ బాబు ముద్దులు కూతురు సితార గురించి కొత్తగా పరిచయం చేసేదేముంది. డాన్స్ లు, ఆటలు, పాటలు అన్నట్లు ఆమె ఎప్పుడేం చేసినా అభిమానులకు చేరిపోతూనే ఉంది. ఎప్పుడూ ఏక్టివ్ గా ఉంటూ ,ముద్దులు ఒలికించే ఈ చిన్నారి తన తండ్రి మహేష్ బాబు పాటలకు డాన్స్ చేస్తూ అదరకొడ్తూ ఉంటుంది. ఆమె డాన్స్ లలో ఆమె ఎక్సప్రెషన్స్ చూసిన వారు ఖచ్చితంగా రాబోయే తరంలో కాబోయే సూపర్ స్టార్ అంటారు.

అంతెందుకు మీకు గుర్తుందా... శ్రీమంతుడు ఆడియో పంక్షన్ సమయంలో శృతి హాసన్, మహేష్ సెల్ ఫోన్ లో ఓ వీడియో చూస్తూ నవ్వుకున్నారు. అయితే ఎందుకువారు అంత గట్టిగా నవ్వారు. అదీ ఆడియో పంక్షన్ లో ..ఏమిటి వారిని ఎట్రాక్ట్ చేసిందీ అనేది హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో మారింది. అయితే మహేష్ ఆ తర్వాత ఫేస్ బుక్ లో ఛాట్ సెషన్ లో మాట్లాడుతూ...వాళ్లేం చూసాడో వివరించాడు. శ్రీమంతుడు లో ఓ పాటకు తన కూతురు సితార చేసిన డాన్స్ చూసి అంతా ఎంజాయ్ చేసామని చెప్పారు.

అయితే ఇప్పుడు మరో సారి సితార డాన్స్ చేసిన వీడియో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఆమె చేసే స్టెప్స్, ఎక్సప్రెషన్స్ చూస్తూంటే తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటుంది అనటంలో సందేహం లేదు అంటున్నారు. ఆ వీడియో మీరూ చూస్తే మీరు అలాగే అంటారు.  

అవును ఈ వీడియో ఎక్కడిది అంటారా.. జీ తెలుగు పాపులర్ టాక్ షో కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను..ధర్డ్ సీజన్ లోది. అందులో యాంకర్ ప్రదీప్ ఈ వీడియో ప్లే చేసి మహేష్ సైతం ఆశ్చర్యపరిచారు. మహేష్ బాబు షాక్ అయ్యి... ఈ వీడియో ఎలా సంపాదించారు అని అడిగారు.

మహేష్ కే కాదు ..ఫ్యాన్స్ కి ఇది పెద్ద సర్పైజే. దాంతో ఈ వీడియో ఇప్పుడు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ట్రెండింగ్ అయ్యి కూర్చుంది. ఇవన్నీ చూస్తూంటే సమంత రీసెంట్ గా అన్నమాట ..నిజమయ్యేటట్లు ఉంది కదూ.. అదేనండి..సితార కాబోయే తరం సూపర్ స్టార్ అని.

ఫ్యాన్ ఫాలోయింగ్

ఫ్యాన్ ఫాలోయింగ్

సితారకు మొదటి నుంచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది

లిటిల్ స్టార్

లిటిల్ స్టార్

సితార చిన్నప్పటి నుంచీ లిటిల్ స్టార్ అని ఫ్యాన్స్ పిలుచుకుంటున్నారు

ఫ్యాన్స్ కు ఇష్టం

ఫ్యాన్స్ కు ఇష్టం

ముద్దులొలికే ఆమె ఫోటోలు అంటే మహేష్ ఫ్యాన్స్ కు భలే ఇష్టం.

వీడియోల గురించి అయితే

వీడియోల గురించి అయితే

సితార డాన్స్ చేసిన వీడియో అంటే ఫ్యాన్స్ భలే ఇష్టపడతారు

స్కూల్ ఫంక్షన్ లోనూ..

స్కూల్ ఫంక్షన్ లోనూ..

సితార ఇటీవల జరిగిన స్కూల్ డాన్స్ పోగ్రామ్ లో డాన్స్ చేసింది. బ్లూ అండ్‌ వైట్‌ కాంబినేషన్‌ ఉన్న డ్రెస్‌తో 'క్లాప్‌ క్లాప్‌' అనే పాటకు ముద్దుముద్దుగా డ్యాన్స్‌ చేసి అందర్నీ ఆకట్టుకుంది.

ఇలాంటివీడియోలను

ఇలాంటివీడియోలను

సితార డాన్స్ వీడియోని సితార తల్లి నమ్రత ఇనిస్ట్రిగ్రామ్ లో అప్పడప్పుడూ పోస్ట్ చేసి అభిమానలకు అందిస్తున్నారు.

అనుకున్నారు

అనుకున్నారు

బ్రహ్మోత్సవం' చిత్రంలో మహేశ్‌బాబు కుమార్తె సితార ఆ మధ్య తెరంగేట్రం చేస్తుందన్న వార్త ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేసింది. కానీ నిజం కాలేదు

 చాలా కాలం

చాలా కాలం

సితార ..ఎంట్రీ విషయమై చాలా సార్లు మహేష్ తో చర్చించాల్సి వచ్చిందని, ఆయన ఒప్పుకోలేదని చెప్తున్నారు.

డిస్ట్రబెన్స్

డిస్ట్రబెన్స్

చక్కగా స్కూల్ కు వెళ్లి చదువుకుంటున్న సితార...మధ్యలో షూటింగ్, షెడ్యూల్ , హడావిడి అంటే డిస్ట్రబ్ అవుతుందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

తల్లి,తండ్రులిద్దరూ

తల్లి,తండ్రులిద్దరూ

గతంలో సితార తల్లి నమ్రత శిరోద్కర్ కూడా హీరోయిన్ గా తెలుగులో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

కృష్ణగారు కూడా

కృష్ణగారు కూడా

తన మనుమరాలిని తెరపైచూడాలని తాతగారు కృష్ణ కూడా మహేష్ తో అన్నట్లు చెప్పుకుంటున్నారు.

మీడియాతో..

మీడియాతో..


సితార స్టెప్స్ , డాన్స్ లు ఇరగతీస్తుందని మహేష్ గతంలో మీడియాతో చెప్పారు

డాన్స్ లే కాదు...

డాన్స్ లే కాదు...

కేవలం డాన్స్ లు మాత్రమే కాకుండా తన తండ్రి మహేష్ డైలాగులు సైతం ఆమెకు చాలా భాగం బట్టీనేట. ఆమె అప్పుడప్పుడూ సరదాగా చెప్పి తన తండ్రిని ఆనందపరుస్తుందిట.

అప్పుడే ఎందుకు

అప్పుడే ఎందుకు

కాకపోతే నమ్రత మాత్రం కొద్ది కాలం ఆగిన తర్వాతే కెమెరా ముందుకు సితారని తేవాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు.

భావించారు

భావించారు


బ్రహ్మోత్సవంలో సితార నటిస్తే ఖచ్చితంగా ఓ నిండుతనం వస్తుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ భావించినట్లు వార్తలు వచ్చాయి

అందుకే

అందుకే

సితార కానీ నటిస్తే ..ఖచ్చితంగా తండ్రి కూతుళ్ల కాంబినేషన్ ఉండాల్సిందే. అలాంటి సీన్స్ బ్రహ్మోత్సవం లో లేవు

అన్న, చెల్లెలు

అన్న, చెల్లెలు

సితారకు డాన్స్ నేర్పటంలో అన్న గౌతమ్ ప్రోత్సాహం చాలా ఉందిట.

ఇంటికి రాగానే

ఇంటికి రాగానే

మహేష్ ఇంటికి రాగానే మొదట పలకరించేది, వెతుక్కునేది సితార గురించేట.

ఎక్కువ సేపు

ఎక్కువ సేపు


ఆ మధ్యన నమ్రత మాట్లాడుతూ...మహేష్ ..ఎప్పుడూ సితార ని వదిలి ఉండడని, ఇంటిలో ఉన్నంతసేపూ సితారతోనే ఎక్కువ సేపు గడుపుతారని అన్నారు.

తండ్రి భుజంపై

తండ్రి భుజంపై

తండ్రి మహేష్ బాబు భుజంపై ఎక్కిన సితార..ఇలా

కొడుకు,కూతురుతో

కొడుకు,కూతురుతో


భుజాలపై కూతురు, ప్రక్కన కొడుకుతో మహేష్

మహేష్ తో కలిసి

మహేష్ తో కలిసి

టూర్ లకు వెళ్తే మహేష్ ని ఒక్క క్షణం కూడా వదలదు సితార

టూరుకు వెళ్లినప్పుడు

టూరుకు వెళ్లినప్పుడు

టూర్ లో మహేష్ తన పిల్లలిద్దరితో

ఇదిగో

ఇదిగో

పిల్లలిద్దరుతో మహేష్ ఎంజాయ్ చేస్తూ....

ముద్దుగా

ముద్దుగా

మహేష్ తో గారం గా ఉన్న సితార ...

క్యూట్

క్యూట్


చూడండి..ఎంత క్యూట్ గా ఉందో సితార

తల్లి తో కలిసి

తల్లి తో కలిసి

తల్లి నమ్రత తో కలిసి సితార ఇలా..

పిల్లలిద్దరూ

పిల్లలిద్దరూ

పిల్లలిద్దరూ టూర్ లో ఎంజాయ్ చేస్తూ...

తల్లి, పిల్లలు

తల్లి, పిల్లలు

తన పిల్లలతో ఆడుకుంటూ, ఆడిస్తూ నమ్రత

English summary
When Mahesh Babu graced the popular talk show, Konchem Touch Lo Unte Cheptha's third season, anchor Pradeep surprised Mahesh by showing the video and Mahesh wondered how he could get it. More than it was for Mahesh, it was a huge surprise for the fans. Right now, Sitara's dance video is putting the social networking sites ablaze and many agree with Samantha's recent statement that, Sitara will make a superstar actress, in future.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu