»   » మీడియా విలేఖరిపై మోహన్ బాబు ఉగ్రరూపం(వీడియో)

మీడియా విలేఖరిపై మోహన్ బాబు ఉగ్రరూపం(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ నిశ్చితార్దంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. పార్క్ హయిత్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి సుషీల్ కుమార్ షిండే విచ్చేసారు. దాంతో జాతీయ ఛానెల్ టౌమ్స్ నౌ కి చెందిన విలేఖరి...నిర్బయ డాక్యుమెంటరీకు సంభందించిన ప్రశ్నను ఆయన్ని వేసారు.

అలాంటివి వద్దని మోహన్ బాబు సూచించారు. అయినా సదరు విలేఖరి..షిండేతో మాట్లాడేందుకు ప్రయత్నించటంతో మోహన్ బాబు ఫైర్ అయ్యారు. ఓ వైపు షిండే ..ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ...వారిస్తున్నా ఆయన ఉగ్రరూపం చల్లారలేదు. ఆ విలేఖరిని అక్కడనుంచి వెళ్లపొవాలని సూచించారు. దానికి సంభందించిన వీడియోని మీరు ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ విషయమై టైమ్స్ నౌ తమ ట్విట్టర్ పేజీలో ఇలా రాసుచొచ్చింది."Shinde threatens, Telugu actor Mohan Babu assaults TIMES NOW reporter when asked on Nirbhaya documentary #NirbhayaInsulted''

మంచు మనోజ్‌ నిశ్చితార్థం ప్రణతితో బుధవారం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. వేదమంత్రాల సాక్షిగా, అత్యంత సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో మనోజ్‌, ప్రణతి పెద్దల సమక్షంలో ఉంగరాలు మార్చుకొన్నారు. పట్టు షేర్వాణీతో మనోజ్‌, పసుపు పట్టుచీరతో ప్రణతి మెరిసిపోయారు. గౌరీ పూజ అనంతరం మోహన్‌బాబు, నిర్మల దంపతులు, వధువు తల్లిదండ్రులు సత్యనారాయణ, ప్రవీణ దంపతులు లగ్న పత్రికలు మార్చుకొన్నారు. అటు సినీ ప్రముఖులు, ఇటు రాజకీయ నాయకుల ఆగమనంతో వేడుక కళకళలాడింది.

Video : Mohan Babu lands in Controversy

నిశ్చితార్థం పనులన్నీ తానే దగ్గరుండి చూసుకొన్న లక్ష్మీ ప్రసన్న... ఓ సందర్భంలో ఉద్వేగం ఆపుకోలేక కంటతడిపెట్టారు. ఆ సమయంలో విష్ణు ఆమెను ఓదార్చారు. మే 20న పెళ్లికి శుభ ముహూర్తం నిర్ణయించారు. అదే రోజు మనోజ్‌ పుట్టిన రోజు కావడం విశేషం. ఆ రోజు ఉదయం గం9.10 నిమిషాలకు హైదరాబాద్‌లో మనోజ్‌ - ప్రణతిల పెళ్లి జరగనుంది.

నిశ్చితార్థానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు, రాజకీయ ప్రముఖులు సుశీల్‌కుమార్‌ షిండే, వై.ఎస్‌.జగన్‌, డి.ఎస్‌, దానం నాగేందర్‌, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి, తలసాని శ్రీనివాసయాదవ్‌, మహేందర్‌రెడ్డి, టి.సుబ్బరామిరెడ్డి, అమర్‌సింగ్‌ హాజరయ్యారు.

సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, చిరంజీవి, సురేఖ, కృష్ణంరాజు, రామ్‌చరణ్‌, ఉపాసన, అఖిల్‌, సునీల్‌, సుశాంత్‌, సుమంత్‌, శింబు, ఆది, బాలకృష్ణ సతీమణి వసుంధర, జయసుధ, జయప్రద, ప్రకాష్‌రాజ్‌, వినాయక్‌, మెహర్‌ రమేష్‌, బాబి, బి.గోపాల్‌, కైకాల సత్యనారాయణ, కోడి రామకృష్ణ, పరుచూరి గోపాల కృష్ణ, శ్రీకాంత్‌, శ్రీను వైట్ల, తాప్సి, ప్రణీత తదితరులు హాజరయ్యారు.

English summary
Mohan Babu assaulted a tv reporter when he questioned former home minister Sushil Kumar Shinde to respond to the ongoing controversy surrounding the Nirbhaya documentary.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu