వైరల్ వీడియో: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో కలిసి భోజనం చేస్తూ బాలయ్య
Recommended Video

హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం అంత్యక్రియలు ముగియడంతో నెక్ట్స్ జరుగాల్సిన కార్యక్రమాలపై ఫ్యామిలీ మెంబర్స్ దృష్టి పెట్టారు. హరికృష్ణ కుమారులు కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్ కలిసి ఇందుకు సంబంధించిన పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏమేం కార్యక్రమాలు నిర్వహించాలనే విషయాలను బాలయ్య స్వయంగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
భోజనం చేస్తూ...
శుక్రవారం మెహదీపట్నంలోని తన అన్నయ్య నివాసంలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లతో కలిసి భోజనం చేస్తున్న బాలయ్య వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ దీన్ని షేర్ చేస్తుండటంతో వైరల్ అయింది.

విషాదం నుండి తేరుకుంటున్నారు
హరికృష్ణ మరణం నేపథ్యంలో నందమూరి కుటుంబంతో పాటు అభిమానుల్లో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ బాధ నుండి అంతా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు.

ఊహాగానాలకు తెర
గతంలో బాలయ్య, ఎన్టీఆర్ గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. బాబాయి, అబ్బాయి మధ్య సరైన సంబంధాలు లేవనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అందులో వాస్తవం లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

బాధను దిగమింగుకుని షూటింగుల్లో
తండ్రి పోయిన బాధలో ఉన్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆ బాధ నుండి బయట పడటానికి పనిలో మునిగిపోనున్నారు. ఎన్టీఆర్ తను నటిస్తున్న ‘అరవింద సమేత' షూటింగులో సెప్టెంబర్ 1న, కళ్యాణ్ రామ్ తన తాజా మూవీ షూటింగ్‌లో సెప్టెంబర్ 3న జాయిన్ కాబోతున్నారు.


Click it and Unblock the Notifications











