For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కల్యాణ్ తాజా ఇంటర్వూ( పూర్తి వీడియో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్‌ కల్యాణ్‌ నటించిన 'గోపాల గోపాల' ఇటీవలే సంక్రాతి కానుకగా విడుదలైంది. ఈ నేపధ్యంలో మీడియా వారితో పవన్ తన ఫామ్ హౌస్ లో ముచ్చటించారు. సంక్రాంతి సందర్భంగా ఆయన ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అదే విధంగా ‘గోపాల గోపాల' చిత్రం గురించిన అంశాలపై కూడా మాట్లాడారు. ఇంతకీ పవన్ ఏం మాట్లాడారు..అనేది మీకూ చూడాలని ఉందా..అయితే ఈ క్రింది వీడియోని వీక్షించండి...

  ఈ ఇంటర్వూలో ఆయన పలు విషయానలు ప్రస్దావించారు. తాను అసలు సినిమా యాక్టర్ అవుతానని ఊహించలేదని, చిన్నతనంలో కూడా తనకు అలాంటి ఆలోచన అసలు ఉండేది కాదని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అనుకోకుండా ఇటు వచ్చేయడం, ఇందులోనే సెటిల్ అయిపోవడం జరిగిందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.

  వెంకటేష్ తో తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ...‘వెంకటేష్ గారిని నేను నా అన్నయ్యలా ఫీలవుతాను. మా ఇళ్లు కూడా దగ్గరరే ఉంటాయి. చిన్నతనం నుండి ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఆయనతో కలిసి ఇలా మల్టీ స్టారర్ చేస్తామని అనుకోలేదు. నాకు అలాంటి చేయాలనే ఆలోచన కూడా ఉండదు. ఇది స్క్రిప్టు కుదిరింది కాబట్టి చేసాం' అని తెలిపారు.

  జీవితంలో హార్డ్ వర్క్ గురించిన ప్రస్తావన వచ్చినపుడు అన్నయ్య చిరంజీవి ప్రస్తావన తెచ్చిన పవన్....కేవలం హార్డ్ వర్క్ వల్లనే పరిశ్రమలో పైకొస్తాం. అన్నయ్య గారు, ఎన్టీఆర్, ఎఎన్ఆర్, షారుక్ ఖాన్, అజిత్ ఇలా చాలా మంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారు ఇందుకు మంచి ఉదాహరణ. నేను చిరంజీవి బ్రదర్ అయినప్పటికీ ఈ పొజిసన్ రావడానికి నా వంతు హార్డ్ వర్క్ చేసాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

   Video: Pawan Kalyan's interview

  ఇక సంక్రాంతి కాంతులన్నీ పల్లె సీమల్లోనే కనిపిస్తాయి. పచ్చటి తోరణాలు, ధాన్యపు రాశుల కళకళలు ఒకపక్క. జంట సన్నాయి మేళం, జోడెద్దుల తాళం నింపే కోలాహలం మరోపక్క. ఆ సందడంతా రైతు ఆనందంగా ఉన్నప్పుడే. ఆ ఆనందం నిత్యం ఉండాలంటున్నారు పవన్‌ కల్యాణ్‌. ''రైతు కన్నీరు పెట్టని గ్రామీణ భారతం రావాలని ఆశిస్తున్నా'' అంటూ సంక్రాంతి శుభకాంక్షలు చెబుతూ తన సందేశాన్ని పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. తన వ్యవసాయ క్షేత్రంలో పొలం పనుల్లో నిమగ్నమై ఉన్నప్పటి ఫొటోల్ని ట్విట్టర్‌లో ఆయన పోస్ట్‌ చేశారు.

  ‘గోపాల గోపాల' విషయానికి వస్తే...

  సంక్రాంతి పండుగ మూడు రోజులు హౌస్ ఫుల్ షోలతో థియేటర్ ల దగ్గర కళకళలాడుతోంది. గత శనివారం విడుదలైన ఈ మల్టీ స్టారర్ సినిమా 18కోట్లను సంపాదించిపెట్టింది. ఈ కలెక్షన్ కేవలం ఆంద్ర, తెలంగాణాలో మాత్రమే కావడం మరో విశేషం.

  వెంకటేశ్‌, పవన్‌కల్యాణ్‌ మొదటిసారి కలిసి నటించిన ‘గోపాల గోపాల' . ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా శనివారం (10వ తేదీ) విడుదలయ్యి పాజిటివ్ టాక్ తెచ్చకుంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై సురేశ్‌, శరత్‌మరార్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కిశోర్‌కుమార్‌ పార్దసాని దర్శకుడు. వెంకటేశ్‌ జోడీగా శ్రియ నటించింది. హిందీలో ఘన విజయం సాధించిన ‘ఓ మై గాడ్‌'కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలతో విడుదలైంది.

  చిత్రం కథేమిటంటే...

  దేవుడంటే నమ్మకం లేని నాస్తికుడైన గోపాల రావు(వెంకటేష్) ... దేముడి బొమ్మల దుకాణం నడుపుతుంటాడు. మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలిపోతుంది. ఇన్సూరెన్స్ కోసం వెళితే యాక్ట్ ఆఫ్ గాడ్ (ప్రకృతి వైపరిత్యాల) క్రింద దాన్ని పరిగణించి, అది దేముడి తప్పిందం చెప్తూ పైసా కూడా ఇవ్వలేమని కంపెనీ వారు చెప్తారు. ఈ నేపధ్యంలో ఏమీ చేయలేని పరిస్ధితుల్లో గోపాల రావు ఆ గాడ్(దేముడి) తన నష్టానికి బాధ్యుడు కాబట్టి ఆయన మీదే కేసు వేస్తాడు. దేముడుకి వ్యతిరేకంగా వాదించటానికి ఏ లాయిరూ ముందుకు రాకపోయేసరికి గోపాలరావు స్వయంగా తానే వాదించుకోవటం మొదలెడతాడు. దేముడు ప్రతినిధులుగా చెప్పబడే స్వామీజీలను, మఠాథిపతులను, బాబాలను కోర్టుకు లాగుతాడు.

  Read more about: pawan kalyan
  English summary
  Video: Pawan Kalyan's interview
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X