‘బ్లాక్ లేడీ’ గురించి రామ్ చరణ్ (వీడియో)
హైదరాబాద్: ప్రస్తుతం అవార్డుల సీజన్ నడుస్తోంది. ఇటీవలే సినీ'మా' అవార్డులు ముగిసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ తారల తలుకు బెలుకులతో వైభంగా ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది. చిరంజీవితో పాటు ఇతర స్టార్ల ఆట పాటలతో అవార్డుల కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది.
మరికొన్ని రోజుల్లో 'సైమా' అవార్డుల వేడుకకు రంగం సిద్ధమవుతోంది. జూన్ లాస్ట్ వీక్ లో ఈ వేడుక జరుగబోతోంది. అంతకంటే ముందుగా సినీ రంగానికి చెందిన మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డుల కార్యక్రమం 'ఫిల్మ్ ఫేర్' అవార్డుల కార్యక్రమం ఈ నెల 18న హైదరాబాద్ లో జరుగబోతోంది.
హైదరాబాద్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ తన అభిమానులు, మూవీ లవర్స్ రావాల్సిందిగా కోరుతున్నారు. 'బ్లాక్ లేడీ'(అవార్డు) ఎప్పటికైనా మళ్లీ దక్కించుకుంటానని నమ్మకంగా చెబుతున్నారు చెర్రీ. గత 9 సంవత్సరాలుగా 'బ్లాక్ లేడీ'ని దక్కించుకోవడానికి తన శక్తి మేర ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
రామ్ చరణ్ తన తొలి సినిమా 'చిరుత'తో పాటు 'మగధీర' సినిమాకు బ్లాక్ లేడీని దక్కించుకున్నాడు. ఈసారి అవకాశం లేక పోయినా త్వరలోనే చెర్రీ ఈ అవార్డును దక్కించుకుంటాననే నమ్మకం వ్యక్తం చేసారు. ప్రస్తుతం రామ్ చరణ్ 'ద్రువ' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications