వీడియో : ఫిటెనెస్ కోసం రామ్ చరణ్ ఇంతలా కష్టపడుతున్నాడు

By Srikanya

హైదరాబాద్ :తను చేస్తున్న తాజా చిత్రం తని ఒరువన్ రీమేక్ కోసం...తన లుక్ మరియు ఫిజిక్ విషయంలో మార్పులు చూపించేందుకు రామ్ చరణ్ పూర్తి స్దాయిలో డిసైడ్ అయ్యాడు. అందుకోసమే చరణ్ తన వెర్షన్ షూటింగ్ ని ఇంకా స్టార్ట్ చేయలేదు.

బాలీవుడ్ నుంచి స్పెషలిస్ట్ లను పిలిపించి మరీ హార్స్ రైడింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడని సమాచారం. ఇప్పటికే చరణ్ కి హార్స్ రైడింగ్ విషయంలో మంచి ప్రావీణ్యత ఉన్నా మరింత డిఫరెంట్ గా కనిపించడం కోసం ఈ ట్రైనింగ్ తీసుకోవడమే కాకుండా డిఫరెంట్ స్టైల్ లో స్టంట్స్ చేయడంలో ట్రైనప్ అవుతున్నాడట.

అలాగే అథ్లెటిక్ బాడీ కోసం కూడా ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు ఓ వీడియోని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. తాను చేసేది చాలా టఫ్ రోల్ కావడంతో పాత్రకు తగిన విధంగా తయారయ్యేందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా రోజూ గంటల తరబడి హార్స్ రైడింగ్, సైక్లింగ్ చేస్తున్నారు. సినిమాలో పాత్ర కోసం రామ్ చరణ్ కాస్త బరువు కూడా తగ్గాల్సి ఉందని, అందుకోసం చాలా కష్టపడుతున్నాడని రామ్ చరణ్ స్పోక్ పర్సన్ తెలిపారు.

ఇక ఈ సినిమా కోసం సన్నగా కనిపించేలా తన ఫిజిక్ మార్చుకుంటున్నాడని చరణ్ సన్నిహితులు అంటున్నారు. అంతేనా ఈసినిమాలో చరణ్ హెయిర్ స్టైల్ చాల డిఫరెంట్ గా ఉండబోతోంది అని టాక్. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని చరణ్ ఈ నెలలో కాశ్మీర్ లో ప్రారంభం కావలసిన తన షెడ్యూల్ ను వాయిదా వేసారట.

VIDEO: See Ram Charan's Rigorous Workout For His Next

ఈచిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ప్రస్తుతం 'ధృవ' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. తర్వాతి షెడ్యూల్ కాశ్మీర్ లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో రామ్ చరణ్ కొత్తగా కనిపించబోతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అరవిందస్వామి ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా, అసీమ్ మిశ్రా సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. దసరా నటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

పూర్తిగా తన లుక్ పై శ్రద్ధ పెడుతూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తీరాలి అన్న పట్టుదలతో చరణ్ ఈ ధృవ కోసం కష్ట పడుతున్నాడని చెప్తున్నారు. మంచిదేగా హీరోలంతా ఇలాగే కష్టపడితే మన సినిమాల్లో కూడా ఖచ్చితంగా అద్బుతాలు జరుగుతాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X