ఎన్టీఆర్ బయోపిక్: బసవతారకం పాత్రలో విద్యా బాలన్ లుక్ ఇలా..!

Recommended Video

Here Is A Glimpse Of Vidya Balan As Basavatarakam From 'NTR Biopic'

తెలుగు సినిమా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో సీనియర్ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ఒకటి. ఈ చిత్రంలో తన తండ్రి పాత్రను స్వయంగా నందమూరి బాలకృష్ణ పోషిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ బయోపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇందులో ఎన్టీ రామారావు సతీమణి బసవతారకం పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె లుక్ ఎలా ఉండబోతోందబ రివీలైంది. ఇందుకు సంబంధించిన లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 బసవతారకం పాత్రలో విద్య బాలన్ ఇలా

బసవతారకం పాత్రలో విద్య బాలన్ ఇలా

‘ఎన్టీఆర్ బయోపిక్' షూటింగ్ సమయంలో బసవతారకం పాత్రపై సన్నివేశాలు చిత్రీకిస్తున్న సమయంలో విద్యా బాలన్ కాటన్ సారీలో దర్శనమిచ్చారు. ఈ ఫోటో చూస్తుంటే క్రిష్ ఈ పాత్రను ఎంత అద్భుతంగా చిత్రీకరిస్తున్నారో అర్థమవుతోందని అభిమానులు చర్చించుకుంటున్నారు.

శ్రీదేవి పాత్రలో రకుల్

శ్రీదేవి పాత్రలో రకుల్

ఈ బయోపిక్ మొదటి భాగం ‘కథా నాయుడు' పేరుతో రూపొందుతోంది. ఇందులో ఎన్టీఆర్ సినీ జీవితం గురించి చూపించబోతున్నారు. హీరోయిన్ శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించబోతున్నారు. ఇందులో ‘ఆకు చాటు పిందె తడిసె' పాటను సైతం రీమిక్స్ చేశారు.

సంక్రాంతికి వస్తున్న కథానాయకుడు

సంక్రాంతికి వస్తున్న కథానాయకుడు

ఎన్టీఆర్ చిన్నతనం, సినిమాల్లోకి ఎలా వచ్చారు, విశ్వా విఖ్యాత నట సార్వభౌముడిగా ఎలా ఎదిగారు అనేది మొదటి భాగంలో చూపించబోతున్నారు. జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబతోంది.

మహానాయకుడు

మహానాయకుడు

రెండో భాగం ‘మహా నాయకుడు' చిత్రంలో ఎన్టీఆర్ రాజకీయ అరంగ్రేటం, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం లాంటి ఘట్టాలు చూపించబోతున్నారు. జనవరి 25న ఈ చిత్ర విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా... బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X