ప్రేమ నిజం..పెళ్ళి అబద్ధం ఖండిస్తున్న డర్టీ విద్యాబాలన్
విద్యాబాలన్ పేరు 'డర్టీపిక్చర్"తో దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. విడుదలకు ముందే ఇటీవల కాలంలో ఇంతగా పబ్లిసిటీ పొందిన చిత్రమిదేనని సినీ విశ్లేషకులు అంటున్నారు. శృంగార నాయిక సిల్క్‌స్మిత జీవితగాథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుండటమే ప్రేక్షకుల్లో ఆసక్తికి కారణం. అయితే ప్రచార చిత్రాల్లో విద్యాబాలన్ అందాల ఆరబోత హద్దులు దాటిందని విమర్శిస్తున్నారు. 'డర్టీపిక్చర్"తో ఇంతగా మీడియాలో నానుతున్న ఈ భామ తాజాగా తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది. యూటీవీ అధినేత సిద్దార్థ రాయ్ కపూర్‌తో విద్యా ప్రేమాయణం నడుపుతుందని, వారిద్దరు గోవాలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు కొన్నాళ్ల క్రితం మీడియాలో గుప్పుమన్నాయి.
తాజాగా ప్రేమ వ్యవహారం నిజమే అని విద్యాబాలన్ తేల్చిచెప్పింది. కాకపోతే పెళ్లి వార్తలు మాత్రం అబద్దమని ప్రకటించింది. 'మా ఇద్దరి అభిరుచులు కలిశాయి. ప్రేమ ప్రయాణం అందంగా సాగిపోతోంది. వివాహబంధంతో ఒక్కటవుదామనే ఆలోచన వుంది. అయితే దానికి చాలా టైముంది" అని చెప్పుకొచ్చింది. వీరిద్దరు ముంబాయ్‌లో ఓ ఖరీదైన భవంతిని ఖరీదు చేశారని, త్వరలో వారిద్దరు కలసి అందులో వుండబోతున్నారని బాలీవుడ్ లో గుసగుసలు వినపడుతున్నాయి.


Click it and Unblock the Notifications











