అతడితో రహస్య ‘సం’బంధం నిజమే: డర్టీ లేడీ
డర్టీ పిక్చర్ హీరోయిన్ విద్యా బాలన్ గత కొంత కాలంగా యూటివీ హెడ్ సిద్దార్థ రాయ్ కపూర్‌తో సంబంధం నడుపుతోందని, ఇద్దరు ఎప్పుడో హద్దులు దాటారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని విద్యా బాలన్ స్వయంగా ఒప్పేసుకుంది. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ....సిద్ధార్థ రాయ్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్న మాట నిజమే, కానీ పెళ్లి గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.
అయినా తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని, పెళ్లి గురించి ఇప్పటి వరకు అసలు ఆలోచించ లేదని, కనీసం ఎంగేజ్ మెంట్ గురించి కూడా ఆలోచించలేదని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా మీడియాకు వెల్లడిస్తానని చెప్పింది. బెంగాళీ వర్షన్ 'డర్టీ పిక్చర్'లో రాఖీ సావంత్ నటించబోతోందని అంటున్నారు. మీరు చేసిన సిల్క్ పాత్రకు ఆమె సూటవుతుందా? అని అడగ్గా.....నా వరకు నేను బాగానే నటించానని అనుకుంటున్నారు. రాఖీ కూడా తన ఒరిజినాలిటీని ఆ చిత్రంలో చూపెతుతుందని అనుకుంటున్నా అని చెప్పింది.
డర్టీ పిక్చర్‌లో నటించడంపై మీ పేరెంట్స్ ఎలా స్పందించారు అని విద్యాను అడ్డగా... మా నాన్న సినిమా చూసిన తర్వాత పాజిటివ్ గా స్పందించారు. ఆ చిత్రంలో విద్యా కంటే సిల్క్‌ను చూడండి అని ఆయన చెప్పారు. నాకు అంతకంటే ప్రశంస ఏం కావాలి అని సమాధానం చెప్పింది.
ప్రస్తుతం విద్యా బాలన్ ఫెరారీకి సవారీ, ఘాన్ చక్కర్ అనే అనే బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల విద్యా నటించిన కహానీ చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కహానీ చిత్రాన్ని ఇప్పుడు సౌత్ లోనూ రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











