నా రేటు ఐదు కోట్లు: డర్టీ హీరోయిన్
స్కిల్ స్మిత జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిస్తున్న 'డర్టీ పిక్చర్" లో విద్యాబాలన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో సిల్క్ స్మిత పాత్రను పోషిస్తున్న విద్యా బాలన్ చాలా హాట్ గా నటించింది. దాంతో బాలీవుడ్ లో ఈవిడగారి పాపులార్టీ పెరిగిపోయింది. ఇదే అతననుకున్న విద్యాబాలన్ తన పారితోషికాన్ని పెంచేసిందని సమాచారం. ప్రస్తుతం తన రేటు 5కోట్లు అని, తనకంత క్రేజ్ ఉందని విద్యాబాలన్ ప్రచారం చేసుకుంటోందట.
రీసెంట్ గా ఓ వెబ్ మ్యాగజైన్ నిర్వహించిన పోల్ లో బాలీవుడ్ లో హాటెస్ట్ హీరోయిన్ ఎవరన్న అంశంలో విద్యాబాలన్ కి మిగతా హీరోయిన్లకన్నా ఎక్కువ ఓట్లు పడటం గమనార్హం. దాంతో విద్య ఇప్పుడు తన రెమ్యునరేషన్ ఐదుకోట్లు పలుకుతుందని చెప్పుకు తిరుగుతోందని సమాచారం. ఈ సినిమా తర్వాత తదుపరి సినిమాలకు అంత పారితోషికం తీసుకోవాలని డిసైడ్ అయ్యిందట విద్యాబాలన్. కానీ బాలీవుడ్ వర్గాలు మాత్రం ఈవిడగారికి అంత లేదు. కోటిపైన ఒక్క పైసా కూడా విద్యాబాలన్ రేటు పలికే అవకాశంలేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











