సిల్క్ స్మిత బర్త్ డే రోజునే విద్యాబాలన్ ‘డర్టీ పిక్చర్’ విడుదల..!
దక్షిణాది శృంగార తార సిల్క్ స్మిత జీవితగాధ ఆధారంగా విద్యాబాలన్ కథానాయికగా తెరకెక్కుతున్న చిత్రం 'డర్టీపిక్చర్". స్మిత జీవితంలోని ఎత్తుపల్లాలను సృజిస్తున్న ఈ చిత్రాన్ని 'డర్టీ పిక్చర్' పేరిట జితేంద్ర కూతురు ఏక్తా కపూర్ నిర్మిస్తోంది. ఏక్తాకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిలాన్ లూథ్రియా దర్శకుడు. ఆరంభం నుంచి పలు సంచలనాలకు వేదికగా నిలుస్తున్న ఈ చిత్రం సిల్క్ స్మిత జయంతి అయిన డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా కథకు తగ్గట్టుగా పోస్టర్ డిజైన్ కూడా 1980ల నాటి ఫీల్ ఇస్తోంది. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సిల్క్ స్మిత బర్త్ డే సందర్బంగా డిసెంబర్ రెండున రిలీజ్ చేయడానికి నిర్మాత ఏక్తా కపూర్ ప్లాన్ చేస్తోంది.
నసీరుద్దీన్‌షా, తుషార్‌కపూర్, ఇమ్రాన్ హస్మీ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. చిత్రంలోని కీలక సన్నివేశాల్ని రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించారు. శృంగార తారగా దక్షిణాది ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రను వేసిన సిల్క్‌స్మిత విషాదాంత జీవితంలోని సంఘటనల స్ఫూర్తితో రచయిత రజత్ అరోరా ఈ సబ్జెక్ట్ ను తయారుచేశాడు. ఆ మధ్యన విడుదలైన ఈ చిత్రం తాలూకు స్టిల్స్, ప్రోమోస్ తీవ్రమైన చర్చకు తెరతీసిన విషయం తెలిసిందే. మోతాదుకు మించి అందాలను ఆరబోసిందని కథానాయిక విద్యాబాలన్ విమర్శలను ఎదుర్కొంది.
తాజాగా పబ్లిసిటీలో భాగంగా టీవీల్లో ప్రసారం కానున్న ఈ సినిమా ట్రైలర్స్‌లోని కొన్ని సన్నివేశాల్ని సెన్సార్ వారు తొలగించారు. డోస్ ఎక్కువయిన శృంగార సన్నివేశాల పట్ల సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరం తెలిపింది. కారులో విద్యాబాలన్, నసీరుద్దీన్‌షా మధ్య నడిచే హాట్ రొమాంటిక్ సీన్‌ను ట్రైలర్స్ నుంచి తొలగించారు. ఏక్తాకపూర్ కోరిన విధంగానే ఈ సినిమా ట్రైలర్స్‌కు యు.ఎ. సర్టిఫికెట్‌ను ఇచ్చింది సెన్సార్‌బోర్డు. అయితే ట్రైలర్స్ యధాతథంగా ప్రదర్శనకు అనుమతిస్తే 'ఎ" సర్టిఫికెట్‌తో ప్రదర్శించాల్సిరావడంతో ఏక్తాకపూర్ సెన్సార్‌వారి కట్స్‌కు ఓకే చెప్పినట్లు తెలిసింది. బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్‌షా ఇందులో సూపర్ స్టార్ గా వయసుమీరిన కథానాయకుడి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











