మనరాష్ట్రంలో ‘డర్టీ పిక్చర్’ చూడలేమా?

By Bojja Kumar

ఒకప్పటిక దక్షిణాది ఐటంగర్ల్ సిల్క్ స్మిత జీవితం ఆధారంగా డర్టీ పిక్చర్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. విద్యాబాలన్ సిల్క్ స్మిత పాత్రను పోషిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రైడ్స్ ను ఇంద్రా ఫిలింస్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా మన రాష్టంలో చూసే అవకాశం దక్కుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. తన సోదరిని కించ పరిచే విధంగా ఉన్న ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ స్మిత సోదరుడు నాగవర్మ ప్రసాద్ రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ వేసిన పిటీషన్ ఇంకా పెండింగులోనే ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2న ఈ సినిమా ఏపీలో విడుదలవుతుందా? లేదా అనేది సందేహంగా మారింది.

మరో వైపు ఈ సినిమాలో సిల్క్ స్మిత జీవితంలోని తెర వెనక వాస్తవాలను చూపిస్తారా? లేక కేవలం విద్యాబాలన్ అందాల ప్రదర్శనకే ఈ సినిమా పరిమితం అవుతుందా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

డర్టీ పిక్చర్ చిత్రంలో విద్యా బాలన్ తో పాటు నసిరుద్దీన్ షా, ఇమ్రాన్ హస్మి, తుషార్ కపూర్ లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మిలన్ లుథ్రియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శోభ కపూర్, ఎక్తాకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X