ఎవరిలో లేని అందాలు విద్యాబాలన్‌లో చూశా అందుకే నగ్నంగా నా కుంచెతో
విద్యాబాలన్ ఈపేరు చెప్పగానే బాలీవుడ్‌లో ఏదో ప్రత్యేకత. దానికి కారణం తాను నటించినటువంటి సినిమాలే తనకి ఆఇమేజిని తెచ్చిపెట్టాయని అంటున్నారు విద్యాబాలన్. ఇటీవల కాలంలో విడుదలైనటువంటి నో వన్ కిల్డ్ జెస్సికా సినిమా ద్వారా తనకంటూ ప్రత్యేకంగా గర్తింపు తెచ్చుకున్నారు. ఈసినిమాకి దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా '1999లో జరిగిన మోడల్ జెస్సికాలాల్ హత్యోదంతం నేపథ్యం తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. అలాగే జెస్సికాలాల్ సోదరి సబ్రినా పాత్రలో విద్యా బాలన్ కనిపిస్తే..ఓ జర్నలిస్టు పాత్రలో రాణి ముఖర్జీ కనిపించి అలరించడం జరిగింది.
ప్రస్తుతం సిల్క్ స్మిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న డర్టీ పిక్చర్ లో విద్యా నటిస్తున్న విషయం తెలిసిందే. హోమ్లీ ఇమేజ్ సంపాదించుకున్న మీరు శృంగార తారగా నటించడానికి ఒప్పుకోవడానికి కారణం ఏంటి? అని విద్యా బాలన్ ని అడిగితే హోమ్లీ ఇమేజ్‌ని నేను కోరుకోలేదు. నేను చేసిన ప్రాతలు చూసి ప్రేక్షకులు ఆ ఇమేజ్ ఇచ్చారు. కానీ నాకు ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోవడం ఇష్టం లేదు. నటిగా నాలోని అన్ని కోణాలను ఆవిష్కరించు కోవాలనుకుంటున్నా. అందుకే డర్టీ పిక్చర్ కి ఓకే చెప్పా అని సమాధానమిచ్చింది.
ఇది ఇలా ఉండే ఈమద్య విద్యాబాలన్‌కు ఓ బంఫర్ ఆఫర్ తగిలిందంట. విద్యాబాలన్ అవును అంటే చాలు ఆమె నగ్న చిత్రాన్ని గీస్తానని అంటున్నాడట ప్రముఖ చిత్రకారుడు ఎమ్ఎఫ్ హుస్సేన్. అపురూప సౌందర్యాలను కలిగిన స్త్రీలు బహు అరుదుగా ఉంటారని, అటువంటి అందాలను తాను విద్యాబాలన్‌లో చూశానని హుస్సేన్ అభిప్రాయపడుతున్నాడంట.
అంతేకాకుకండా తన మనసులో పుట్టినటువంటి కోరికను విద్యాబాలన్‌కు తెలియజేశాడని సమాచారం. విద్య ఒప్పుకుంటే ఆమె నగ్న సౌందర్యాన్ని తన కుంచెతో అత్యంత రమణీయంగా చిత్రిస్తానని తన సన్నిహితులు వద్ద చెప్పాడని వినికిడి.


Click it and Unblock the Notifications











