twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెన్సార్ బోర్డ్‌కి షాక్: నిహ్లానీని తొలగింపు, విధ్యా బాలన్, గౌతమీ, జీవితలకి స్థానం

    మొదటినుంచీ వివాదాల్లోనే ఉన్న నిహ్లానీ పదవీ కాలం 2018 జనవరిలో ముగియాల్సి ఉండగా ఆయన్ని కేంద్రం పదవి నుంచి తప్పించింది.

    |

    కేంద్ర సెన్సార్‌ బోర్డు ఛైర్మన్‌ పహ్లాజ్‌ నిహ్లానీని సెన్సార్‌ బోర్డు ఛైర్ పర్సన్‌ పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో ప్రముఖ కవి., రచయిలత ప్రసూన్‌ జోషిని సెంట్రల్‌ బోర్డ్‌ ఫర్ ఫిల్మ్‌ సర్టిఫికెషన్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 2015 జనవరిలో సిబిఎఫ్‌సి ఛైర్‌ పర్సన్‌గా నిహ్లానీ బాధ్యతలు స్వీకరించారు. అదే సమయంలో సినీ నటి గౌతమిని సెన్సార్ బోర్డ్ సభ్యురాలిగా నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. సెన్సార్ బోర్డులో గౌతమితోపాటు జీవిత రాజశేఖర్, జాతీయ అవార్డ్ గ్రహీత విద్యాబాలన్, వివేక్ అగ్నిహోత్రి, టీఎస్ నాగభరన, వాణి త్రిపాఠి టికూ, నరేంద్ర కోహ్లీ, నరేష్ చంద్రలాల్, నీల్ హార్బర్ట్, వామన్ కేంద్రే, రమేష్ పతంగె వంటి ప్రముఖులు సభ్యులుగా వున్నారు.

    నిహ్లానీ

    నిహ్లానీ

    మొదటినుంచీ వివాదాల్లోనే ఉన్న నిహ్లానీ పదవీ కాలం 2018 జనవరిలో ముగియాల్సి ఉండగా ఆయన్ని కేంద్రం పదవి నుంచి తప్పించింది. నిహలని తొలగించిన కొద్దిసేపటికే కొత్త సభ్యుల జాబితాను సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 2015 జనవరిలో సిబిఎఫ్‌సి ఛైర్‌ పర్సన్‌గా నిహలనీ బాధ్యతలు స్వీకరించారు

    Recommended Video

    Vidya Balan down with Dengue, Shahid Kapoor gets BMC notice |Oneindia News
    విద్యాబాల‌న్, గౌత‌మి, జీవిత

    విద్యాబాల‌న్, గౌత‌మి, జీవిత

    కొత్త బోర్డులో గౌతమి., నరేంద్ర కోహ్లీ., నరేష్ చంద్ర లాల్., నీల్ హెర్బట్ నంజీరి., వివేక్ అగ్ని హోత్రి., వామన్ కేండ్రే., విద్యా బాలన్., టి ఎస్ నాగభరణ., రమేష్ పతంగే., వాణి త్రిపాఠి., జీవిత రాజశేఖర్., మిహిర్ భూట ల తో మూడేళ్ళ కాలానికి సెన్సార్ బోర్డు ని ప్రకటించారు. బాలీవుడ్ హీరోయిన్‌ విద్యాబాల‌న్, తెలుగు హీరోయిన్లు గౌత‌మి, జీవితాలు సెన్సార్ బోర్డులో స‌భ్యులుగా నియమితులయ్యారు.

    బోల్డ్ సీన్స్‌తో

    బోల్డ్ సీన్స్‌తో

    అయితే నిన్నటి వరకు తన సినిమాలతో సెన్సార్ బోర్డు కత్తెరకు పని పెట్టిన విద్యా చేతికి ఇప్పుడదే కత్తెర రావడం ఆసక్తి కలిగించే అంశం. ఇటీవలే ‘బేగంజాన్‌'లో హాట్, బోల్డ్ సీన్స్‌తో సెన్సార్ బోర్డుకు విద్యాబాలన్ పెద్ద షాకిచ్చింది. ‘బేగంజాన్‌'కు ఏకంగా 12 కట్స్ వేసింది సెన్సార్ బోర్డ్. అలాగే విద్యా చెప్పిన కొన్ని డైలాగ్స్‌ను కూడా వాయిస్ డౌన్ చేసింది. మరికొన్ని డైలాగ్స్‌కు బీప్ సౌండ్ పెట్టాలని కూడా సూచించింది.

    డర్టీ పిక్చర్

    డర్టీ పిక్చర్

    గతంలో ‘డర్టీ పిక్చర్' ట్రైలర్ విడుదలవగానే పెద్ద హడావిడే జరిగింది. మోతాదుకు మించి సెక్సీ సీన్స్ ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. సెన్సార్ బోర్డు కత్తెర అందుకోకపోతే థియేటర్‌లో కూర్చోగలమా..? అన్నారంతా. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. పేరుకే ‘డర్టీ పిక్చర్' అయినా మంచి ఎమోషన్స్‌ను ప్రజెంట్ చేసింది ఈ సినిమా.

    జాతీయ అవార్డు

    జాతీయ అవార్డు

    విద్యాబాలన్ నటనకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. కలెక్షన్స్ పరంగానూ దుమ్ము రేంపింది. . స్వచ్ఛభారత్ లాంటి కొన్ని ప్రకటనలతోనూ అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు ప్రజాధారణను పొందింది విద్యాబాలన్. ఈ కోవలోనే సెన్సార్ బోర్డులో ఆమెకు ఛాన్స్ దక్కిందని చెప్పొచ్చు.

    ఈమెకు ఆర్ట్ తెలుసు

    ఈమెకు ఆర్ట్ తెలుసు

    విద్యాబాలన్ సెన్సార్ బోర్డు చైర్మనేం కాదు.. మెంబరే. కానీ ఆమె స్థాయి కూడా తక్కువేం కాదు. ఎందుకంటే గతంలో సినిమాలతో సంబంధం లేనివాళ్లెందరో సెన్సార్ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. కానీ ఈమెకు ఆర్ట్ తెలుసు.. కమర్షియల్ తెలుసు.. కాంట్రవర్సీస్ తెలుసు. ఇన్నాళ్లూ సెన్సార్ బోర్డు కత్తెరకు పని చెప్పిన ఈమె చేతికే కత్తెర రావడం స్పెషలే మరి.

    సంతోషంగా ఉంది

    సంతోషంగా ఉంది

    సెన్సార్ బోర్డుతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పిన విద్యాబాలన్.. తన బాధ్యతను కచ్చితంగా నిర్వర్తిస్తానని చెప్పింది. సమాజంలో వాస్తవాలను, కష్టాలను, సున్నితమైన విషయాలను ప్రతిబింబించే సినిమాలను అనుమతించే విభాగంలో పనిచేయడం చాలా ఉద్వేగాన్ని కలిగిస్తోందని విద్యా అంటోంది.

    English summary
    Lyricist-screenwriter-ad guru Prasoon Joshi is all set to take up the role of the Chairperson of Censor Board of Film Certification, after Pahlaj Nihalani being sacked from the organisation. Personalities like Vidya Balan, Gautami Tadimalla and others are joining CBFC as new members.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X