కోరిక ఆపులేక పోతున్నా...పెళ్లి చేసుకుంటా : విద్యా

గత కొంత కాలంగా విద్యాబాలన్ యుటీవి మోషన్ పిక్చర్స్ ప్రతినిధి సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తో రహస్యంగా ప్రేమాయణం సాగిస్తోందని, 'డర్టీపిక్చర్" విడుదల తర్వాత వీరిద్దరు తమ పెళ్లికి సంబంధించిన వార్తని అధికారికంగా వెల్లడించనున్నారని బాలీవుడ్ టాక్. సిద్ధార్థ్ రాయ్ కపూర్ గతంలో విద్యా నటించిన'నో వన్‌కిల్డ్ జస్సిక" చిత్రానికి నిర్మాత. ఆ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అంటుంటారంతా...
ప్రస్తుతం ఆమె నటించిన'డర్టీపిక్చర్" సిల్క్‌స్మిత పుట్టిన రోజున డిసెంబర్ 2న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రంలో విద్యా స్మిత పాత్రను పోషించగా, నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ హస్మి, తుషార్ కపూర్ ఇతర పాత్రలను పోషించారు. మిలన్ లూథ్రియా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎక్తా కపూర్ నిర్మించారు.


Click it and Unblock the Notifications











