For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లై ఐదేళ్లయినా ఇంకా పిల్లలు?.., నా జీవితంలో 20మంది..: విద్యా బాలన్

    |
    పెళ్లై ఐదేళ్ళే.. 20 మంది పిల్లలా ?

    ఒక నిండు గర్భిణీ పాత్రలో కోల్‌కతా ఇరుకు సందుల్లో పరిగెడుతూ 'కహానీ' సినిమాలో విద్యా బాలన్ కనబరిచిన నటనను అంత ఈజీగా మరిచిపోగలమా!.., అంత ట్రెడిషనల్‌గా కనిపించిన విద్యా.. డర్టీ పిక్చర్ పాత్రలో అంతే బోల్డ్ నెస్‌తో రెచ్చిపోవడం మరవగలమా!..

    కెరీర్ పరంగా తొలి నుంచి విద్యా బాలన్ మిగతా హీరోయిన్ల కన్నా భిన్నమనే చెప్పాలి. వైవిధ్యభరితమైన కథాంశాల్లో నటించడానికే ఆమె మొగ్గుచూపుతూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా బేగం జాన్, తుమ్హారీ సులు వంటి విభిన్న కథాంశాలతో ఆమె ప్రేక్షకులకు ముందుకు వచ్చారు.

    జనవరి 1న విద్యా 39వ వడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. తన సినిమాల గురించి వ్యక్తిగత విషయాల గురించి ఆమె పలు ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..

    బర్త్ డే.. సెలబ్రేషన్స్:

    బర్త్ డే.. సెలబ్రేషన్స్:

    '39వ వడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఏదైనా ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇందుకోసం నా స్నేహితులు, నా భర్త కూడా ఏవో ఏర్పాట్లుచేస్తున్నారు..' అని విద్యా చెప్పారు.

     20మంది పిల్లలు:

    20మంది పిల్లలు:

    విద్యా బాలన్ ప్రెగ్నెంట్ అని ఆమధ్య పుకార్లు షికారు చేసిన సంగతి తెలిసిందే. పెళ్లై ఐదేళ్లయినా పిల్లలు లేకపోవడంపై విద్యా తాజాగా స్పందించారు. 'నా సినిమాలే నా పిల్లలు. అంటే నా జీవితంలో 20 మంది పిల్లలున్నారు' అని చెప్పుకొచ్చారు.

     సినిమాలపైనే ధ్యాస:

    సినిమాలపైనే ధ్యాస:

    ప్రస్తుతం తన ధ్యాసంతా కేవలం సినిమాలపైనే ఉందన్నారు విద్యా బాలన్. కెరీర్ పరంగా మరిన్ని మంచి చిత్రాలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

     'సులు'తో అదరగొట్టిన విద్య:

    'సులు'తో అదరగొట్టిన విద్య:

    ఈ ఏడాది విడుదలైన 'తుమ్హారీ సులు' చిత్రంలో ఓ మధ్య తరగతి ఇల్లాలి పాత్రలో విద్యా తనదైన నటనతో కట్టిపడేశారు. భార్యగా, తల్లిగా, ఉద్యోగిగా మధ్యతరగతి మహిళగా సులు పాత్రలో విద్యా ఒదిగిపోయిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా రూ.50కోట్ల పైచిలుకు కలెక్షన్స్ రాబట్టింది. ఇదే ఏడాది విడుదలైన బేగం జాన్ సినిమా మాత్రం నిరాశపరిచింది.

    English summary
    Vidya, who is close to turning 39, revealed how she is preparing for her birthday on January 1. “Since I’m turning 39, I’ve been telling my friends that I want to do something crazy,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X