నిరాడంబరంగా విద్యా బాలన్ పెళ్లి (ఫోటో ఫీచర్)
ముంబై: డర్టీ పిక్చర్ చిత్రం దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ మెడలో మూడు ముళ్లు పడ్డాయి. యూటివి అధినేత సిద్ధార్థరాయ్ కపూర్‌తో విద్యాబాలన్ వివాహం ముంబైలో ఈ రోజు నిరాడంబరంగా జరిగింది. బాంద్రాలోని గ్రీన్ మైల్ బంగ్లాలో వీరి వివాహ వేడుక జరిగింది.
ఈ పెళ్లి పూర్తిగా సౌతిండియా సాంప్రదాయ ప్రకారం జరుగడం విశేషం. విద్యా బాలన్ తన ఫ్రెండ్ సబియా సాచి ముఖర్జీ డిజైన్ చేసిన సిల్క్ సారీ ధరించింది. సిద్ధార్థరాయ్ కపూర్ సాంప్రదాయ పెళ్లి దుస్తులు ధరించారు. కొత్త దంతపులకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు తమ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
ఇంతకు ముందు... అంటే మంగళవారం వీరి వివాహానికి సంబంధించిన సంగీత్ వేడుక నిరాడంబరంగా జరిగింది. కార్యక్రమంలో సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. బాంద్ర లో ఉన్న విద్యాబాలన్ ఇంట్లో ఈ సంగీత్ వేడుక జరిగింది. బాలీవుడ్ వాతావరణం ఈ వేడుకలో కనిపించక పోవడం విశేషం.
సిద్దార్థ రాయ్ కపూర్ సోదరులు కునాల్ రాయ్ కపూర్, అదిత్య రాయ్ కపూర్, విద్యాబాలన్ సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సంగీత్ వేడుకలో సిద్దార్థ రాయ్ కపూర్ తెల్లటి కుర్తా ధరించగా, విద్యాబాలన్ కాంజీపురం పట్టు చీర కట్టుకుంది. ఇక మెహందీ వేడుక నిన్న(బుధవారం) జరిగింది. ఈ వేడుకలో విద్యా బాలన్ ఎల్లో కలర్ సారీతో, ముత్యాల హారాలతో అందరి దృష్టిని ఆకర్షించింది.

విద్యా బాలన్ తన వివాహం సాధారణంగా ఉండడానికి నిశ్చయించుకున్నారు.

పెళ్లి వేడుకలో వరుడు సిద్ధార్థరాయ్ కుపూర్

సిద్ధార్థరాయ్ కపూర్ సోదరుడు కునాల్ రాయ్ కపూర్

పెళ్లి వేడుక సాదాసీదా డొకొరేషన్

విద్యా బాలన్ తల్లిదండ్రులు

సంగీత్ ఫంక్షన్లో సిద్ధార్థరాయ్ కపూర్-విద్యా బాలన్

మెహందీ వేడుక అనంతరం మీడియాకు హాయ్ చెబుతున్న విద్యా బాలన్


Click it and Unblock the Notifications











