రూ. 7 కోట్లు డిమాండ్ చేస్తున్న విద్యా బాలన్?

By Bojja Kumar

సిల్మ్ స్మిత జీవితం ఆధారంగా రూపొందిన 'డర్టీ పిక్చర్' మంచి విజయం సాధించి...బంపర్ కలెక్షన్లు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. వారం రోజుల్లోనే ఈ సినిమా దేశ వ్యాప్తంగా దాదాపు రూ. 50 కోట్ల వసూలు చేసినట్లు తెలుస్తోంది. విద్యాబాలన్ అందాల ఆరబోతే పెట్టుబడిగా రూపొందిన ఈ సినిమాకు, నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ హస్మీలాంటి లాంటి స్టార్ల పెర్ఫార్మెన్స్ సినిమాకు అదనపు ఆకర్షణ తెచ్చాయి. ఏది ఏమైనా సినిమా హిట్ కావడానికి మూల కారణం విద్యాబాలన్ మత్తెక్కించే నటన, పిచ్చెక్కించిన అందాలే.

ఈ దెబ్బతో విద్యా బాలన్ కు సినిమా అవకాశాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్నాయి. ఈ సినిమా విజయంతో విద్యా ఇప్పడు బాలీవుడ్ A గ్రేడ్ హీరోయిన్ల లిస్టులో చోటు దక్కించుకుంది. ఇప్పటి వరకు ఆ లిస్టులో ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా లాంటి హీరోయిన్లు మాత్రమే ఉన్నారు. తనపై క్రేజీ ఉన్నప్పుడే తనకున్న డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలనే చూస్తున్న విద్యా....ప్రస్తుతం ఒక సినిమా చేయడానికి రూ. 7 కోట్లు డిమాండ్ చేస్తుందట. బాలీవుడ్ ఇప్పటి ఇంత మొత్త తీసుకున్న హీరోయిన్లు చాలా అరుదు. ఇప్పుడు ఆలిస్టులో విద్యా బాలన్ కూడా చేరబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X