ఆ హీరో లీనమై పనిచేయటం అధ్బుతం..విద్యాబాలన్
ఏ సన్నివేశాన్నయినా తన హావభావాలతో, సంభాషణలతో మరింత మెరుగ్గా తీసుకొచ్చే ప్రతిభ అతడి సొంతం. అతడి కళ్లలో గమ్మత్తేదో ఉంది. అవి కూడా సన్నివేశానికి తగ్గట్లు మాట్లాడుతుంటాయి. 'పా'లో అతనితో కలిసి చేసిన సన్నివేశాల్ని నేను మరచిపోలేను" అని అభిషేక్ బచ్చన్ గురించి పొగడుతోంది విద్య బాలన్. అభిషేక్, విద్యాబాలన్‌ల కొడుకుగా అమితాబ్‌బచ్చన్ నటించిన సినిమా 'పా' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ...అభిషేక్ కళ్లలో మ్యాజిక్ ఏదో ఉన్నట్లనిపించింది. అభిషేక్ నటనలో సహజత్వముంటుంది..రిహార్సిల్ తో అతనికి పనిలేదు" అని ప్రశంసిస్తుంది. అంతేకాదు, మరోసారి అతనితో కలిసి పనిచేయాలనేది నా ఆకాంక్ష. అంటోంది. ఇక 'పా' సినిమాలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది విద్యాబాలన్.
విద్యా బాలన్ అభిషేక్ బచ్చన్ అమితాబ్ పా గురు మాధవన్ టబు vidya balan abhishek bachchan amithab paa guru maniratnam madhavan


Click it and Unblock the Notifications