మోదీ టెంట్ అద్భుతంగా ఉంది: విద్యాబాలన్
గుజరాత్ లో తనకు కేటాయించిన టెంట్ అద్భుతంగా ఉందని, రాజభోగాలు అనుభవిస్తున్నట్టు ఉందని ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ తెలిపింది.
Recommended Video

గుజరాత్ లో తనకు కేటాయించిన టెంట్ అద్భుతంగా ఉందని, రాజభోగాలు అనుభవిస్తున్నట్టు ఉందని ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ తెలిపింది. ఈ బాలీవుడ్ భామ సురేష్ త్రివేణి దర్శకత్వంలో తుమార్హీ సులు అనే చిత్రం చేసింది. ఈ మూవీ నవంబర్ 17న విడుదల కానుండగా, చిత్ర ప్రమోషన్ కోసం రీసెంట్‌గా గుజరాత్ వెళ్లింది. ఈ సందర్భంగా గుజరాత్ పర్యాటక శాఖ ఆమెకు ప్రత్యేక సౌకర్యాలు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ టెంట్ ని కేటాయించారు.

సినిమాని ప్రమోట్ చేసుకొనే పనిలో పడింది
ఇందులో సోఫా, టీవీ, మల్టీమీడియా ప్లేయర్లు, రెండు బెడ్ రూమ్‌లు ఉన్నాయి. వాస్తవానికి ఈ టెంట్ ను ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే కేటాయిస్తారట. . విద్యా ప్రస్తుతం తన సినిమా సినిమా ఈనెల 17న "తుమ్హారీ సులు" ప్రేక్షకుల ముందుకు రానుందిని ఓ రేంజ్‌లో ప్రమోట్ చేసుకొనే పనిలో పడింది.

సల్మాన్ బిగ్ బాస్ షో
ఇటీవల సల్మాన్ బిగ్ బాస్ షోకి కూడా వెళ్లి అక్కడ సినిమాకి సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంది.. దీనిపై ఆమె మాట్లాడుతూ, "ఆ టెంట్ చాలా అద్భుతంగా ఉంది. అందులో ఉన్నంతసేపూ రాజభోగాలు అనుభవిస్తున్నట్లు అనిపించింది' అని చెప్పింది.

ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు
బేగమ్ జాన్ నిరాశ పరిచిన తర్వాత మళ్ళీ హీరోయిన్ కి ప్రాముఖ్యత ఉన్న పాత్రలోనే విద్యాబాలన్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ తుమ్హారీ సులు, ఈ సినిమా కోసం బాగానే కష్టపడింది, మధ్యతరగతి ఇల్లాలి పాత్రలో కనిపిస్తున్న విధ్యా బాలన్ అందరికీ తెగ నచ్చేసింది.

రేడియో జాకీ
ఇందులో విద్యది మధ్యతరగతి ఇల్లాలి పాత్ర. అనుకోకుండా రేడియో జాకీగా మారి గుర్తింపు తెచ్చుకుంటుంది.ఆ గుర్తింపు ఆమె కుటుంబ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిందనే అంశంతో ఈ సినమాను డైరెక్టర్ సురేష్ త్రివేణి తెరకెక్కించారు. గతంలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రంలో రేడియోజాకీగా విద్యాబాలన్ నటించిన సంగతి తెలిసిందే.

సులోచన అలియాస్ సులు
ఈసారి కూడా సులోచన అలియాస్ సులు పాత్రలో విద్యాబాలన్ అద్భుత ప్రదర్శనను కనబరుస్తుందని సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి. సురేశ్ త్రివేణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదల కానుంది. ఇందులో నేహా దూపియా కూడా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











