నేను గర్భవతైనట్లు ప్రచారం నమ్మొద్దు, హీరోయిన్ ఆవేదన!
హైదరాబాద్: యూటీవీ హెడ్ సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ను ఇటీవల పెళ్లాడిన బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ ఈ మధ్య తరచూ ఆసుపత్రికి వెలుతోందని, ముంబైలోని అంధేరి ప్రాంతంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి విద్యా బాలన్ ఈ మధ్య క్రమం తప్పకుండా వస్తుండటం పలు అనుమానాలకు దారి తీస్తోందని, గర్భం దాల్చడం వల్లనే విద్యా బాలన్ ఆసుపత్రికి వస్తోందని ఇటీవల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో విద్యా బాలన్ ఈ వార్తలపై స్పందించింది. తాన గర్భం దాల్చినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ప్రస్తుతం తాను సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నానని, ఇప్పట్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆలోచన ఏమీ లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను కమిటైన సినిమాలు పూర్తయ్యే వరకు ప్రెగ్నెన్సీకి దూరంగా ఉంటానని విద్యా బాలన్ తెలిపింది.
విద్యా బాలన్ సినిమాల విషయానికొస్తే...2013 సంవత్సరంలో విద్యాబాలన్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఆ సంవత్సరం అంతా పలు చిత్రాలు చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. ఆమె నటిస్తున్న షాది కి సైడ్ ఎఫెక్ట్స్, బాబీ జాసోస్, హమారీ ఆధురి కహానీ చిత్రాలు ఈ సంవత్సరం విడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications












