అక్రమ సంభంధ కథలైతే చేస్తానంటోంది
ఇటీవలి కాలంలో మనం ఎక్కువగా వింటుండే వివాహేతర సంబంధాలు లాంటి కథలు చెయ్యాలని ఉంది అంటోంది విద్యాబాలన్. ఎందుకంటే...మన జీవితాలలో ఎంతో డ్రామా ఉంది. అందుకే అలాంటి డ్రామా ఎక్కువ పాళ్ళలో ఉండే స్టోరీలో నటించాలనుకుంటున్నాను అని ఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాట చెప్పింది విద్యా బాలన్. అలాగే వివాహేతర సంభందంల కధలతో వచ్చిన అర్ద్, సిల్ సిలా వంటి చిత్రాలు అయ్యితే మరింతగా నచ్చుతాయంటోంది. డర్టి పిక్చర్ తో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ తెచ్చుకున్న ఆమె మనస్సు ఇప్పుడు ఇలాంటి కదాంసలపై పండింది.
ప్రస్తుతం సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీతో ఒక కామెడీ థ్రిల్లర్‌లో నటిస్తున్న విద్యా బాలన్ గతంలో ఇలాంటి ప్రయోగమేదీ చేయలేదు అంటోంది. హాస్య ప్రధాన చిత్రాల్లోనూ నా సత్తా చాటాలనుంది. యాక్షన్‌కు సంబంధించిన ఇతర కోణాల పట్ల నాకంత ఆసక్తి లేదు అని తేల్చి చెప్పింది. అలాగే ...ఆమె ఇందిరా గాంధీ కథను ఎవరైనా సినిమా గా తీస్తానంటే వెంటనే డేట్స్ ఇవ్వటానికి రెడీ అని చెప్పింది. ఖచ్చితంగా ఇందిరాగాంధీ అనికాదు కానీ అలాంటి బయోపిక్ స్టోరీలైతే మరింతగా నేను నటించగలను..నాకు వాటిపై ఆసక్తి ఉంది అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











