‘డర్టీ పిక్చర్’లో బరితెగించలేదంటున్న విద్యా బాలన్
సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందుతున్న 'డర్టీ పిక్చర్" త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి A సర్టిఫికెట్ జారీ కావడానికి తోడు... ఈ సినిమాలో తన సోదరి పాత్రను అశ్లీలంగా చూపించారని, ఆ సినిమా విడుదలను నిషేదించాలని స్మిత సోదరుడు నాగ వర్మ ప్రసాద్ కోర్టకు ఎక్కడంతో ఇదో అశ్లీల చిత్రంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఇక సినిమా ట్రైలర్స్ లో విద్యా ఎద అందాలు బాహాటంగా ప్రదర్శిస్తుండటంతో ఆమె బరితెగించిందనే అపవాదు కూడా మూట గట్టుకుంది.
అయితే విద్యా బాలన్ మాత్రం ఈ వాదనను ఖండిస్తోంది. డర్టీ పిక్చర్ లో నేను బరితెగించ లేదు అనే మాటను చెప్పకనే చెప్పింది. ఈ సినిమా పేరులోనే డర్టీ తప్ప సినిమాలో ఉండదంటోంది. మంచి కథ, కథనం ఉంటుంది. వాస్తవిక పాత్రను పోలి ఉంటుంది అంటోంది.
అంతకు ముందు వరకు బాలీవుడ్ కే పరిమితం అయిన విద్యా... డర్టీ పిక్చర్ ద్వారా ఇండియా వైడ్ సెల్రబిటీ అయిపోయింది. దీంతో ఈమెను ప్రతి కంపెనీ రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తోంది. తాజాగా హైదరాబాదులో ఓ ఐస్ క్రీమ్ షాపు, బట్టల షాపు ప్రారంభోత్సవానికి వచ్చిన విద్యా బాలన్ అక్కడి అభిమానుల కోరిక మేరకు ఊ.. లల్లా.. ఊ.. లల్లా.. అంటూ నాలుగు స్టెప్పులు కూడా వేసింది.


Click it and Unblock the Notifications











