సెక్స్ సినిమాలే ఇష్టమంటున్న ‘డర్టీ’ హీరోయిన్
శృంగారం(సెక్స్) పాధాన్యం ఉన్న సీన్లు ఉన్న సినిమాలంటే నాకు తెగ ఇష్టం అంటోది డర్జీ పిక్చర్ హీరోయిన్ విద్యా బాలన్. ఇప్పటి వరకు బాలీవుడ్ లో వచ్చిన ఇలాంటి సినిమాలను వదలకుండా చూశానని ఎలాంటి జంకుబొంకు లేకుండా చెబుతోంది విద్యా. తాను డర్జీ పిక్చర్ సినిమాకు కమిట్ కావడానికి కారణం కూడా గతంలో వచ్చన శృంగార ప్రాధాన్యం ఉన్న సినిమాలే అంటోంది.
ఇష్కియా, లవ్ సెక్స్ అండ్ ధోకా, సత్యం శివం సుందరం, ఉత్సవ్, ఆస్తా తదితర సినిమాల్లోని శృంగారం సన్నివేశాలు నాకు ఎంతో నచ్చాయని అంటోంది. ఈ సినిమాలు ఆదర్శంగా తీసుకుని డర్జీపిక్చర్ లో నటించానని, ఫ్యూచర్ లోనూ శృంగారంతో కూడిన గ్లామరస్ పాత్రలు చేస్తానని తెగేసి చెబుతోంది.
కాగా...విద్యాబాలన్ నటించిన 'డర్జీ పిక్చర్" నేడు(డిసెంబర్ 2) విడుదలయింది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో విద్యా స్మిత పాత్రను పోషించింది. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాలో అందాలు విప్పి ఆరబోసింది ఈ తార.


Click it and Unblock the Notifications











