‘ఎన్టీఆర్’ చిత్రం చేయడానికి కారణం అదే.. బసవతారకం పాత్ర గురించి విద్యాబాలన్

By Rajababu

Recommended Video

NTR Bio Pic : Actress Vidya Balan Talks About Her Character

ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌ ద్వారా బాలీవుడ్ నటి విద్యా బాలన్ తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్ సతీమణి బాసవతారకం పాత్రను ఆమె పోషిస్తున్నారు. ఈ పాత్రలో విద్యాబాలన్‌ను నటింపజేసేందుకు బాలకృష్ణ స్వయంగా ముంబై వెళ్లి ఆమను ఒప్పించారు కూడా. పాత్ర ఔచిత్యం గురించి తెలుసుకొన్న ఆమె బవసతారకం పాత్రలో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పాత్ర భావోద్వేగాలతో

పాత్ర భావోద్వేగాలతో

ఎన్టీఆర్ బయోపిక్‌లోని బసవతారకం పాత్రపై విద్యాబాలన్ ఇటీవల స్పందించారు. ఎన్టీఆర్ భార్యగానే బసవతారకం అందరికి తెలుసు. కానీ ప్రజాదరణ పొందిన వ్యక్తి కాకుండా కేవలం గృహిణి మాత్రమే. కానీ ఆ పాత్రలో చాలా భావోద్వేగాలు ఉన్నాయి అని విద్యాబాలన్ పేర్కొన్నారు.

ఆమెలో ఆ గొప్పతనమే

ఆమెలో ఆ గొప్పతనమే

ఎన్టీఆర్ భార్యగా బాసవతారకం గురించి అందరికి తెలుసు. కానీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ తెలియదు. బసవతారకంలో ఉన్న గొప్పతనమే ఆ పాత్రను చేయడానికి నాలో ఆసక్తి కలిగించింది. అందుకే ఆ పాత్రను చేస్తున్నాను అని విద్యాబాలన్ చెప్పారు.

పాత్రలో ఒదిగేందుకు కసర్తత్తు

పాత్రలో ఒదిగేందుకు కసర్తత్తు

ఎన్టీఆర్ ప్రజా జీవితానికి ఈ పాత్రకు సంబంధం ఉండదు. నటుడిగా ఎన్టీఆర్‌కు అండగా నిలిచిన ఆ పాత్ర తీరు నన్ను ఆకట్టుకొన్నది. ఈ పాత్రలో ఒదిగిపోవడానికి ఇప్పటికే తగినంత కసరత్తు చేస్తున్నాను. తెలుగులో ఇది నాకు తొలి చిత్రం. చాలా ఉత్సాహంగా ఉంది. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొంటాననే భావన నాలో ఉంది అని విద్యాబాలన్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

క్రిష్ దర్శకత్వంలో

క్రిష్ దర్శకత్వంలో

గౌతమి పుత్ర శాతకర్ణిని తెరకెక్కించిన క్రిజ్ జాగర్లముడి ఎన్టీఆర్ చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నాను. ఈ చిత్రంలో నారా చంద్రబాబు నాయుడిగా రానా దగ్గుబాటి కనిపిస్తారు. బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

ముఖ్య పాత్రలో కీర్తి సురేష్

ముఖ్య పాత్రలో కీర్తి సురేష్

మహానటి చిత్రంతో సావిత్రి పాత్రతో ప్రేక్షకాదరణ మూటగట్టుకొన్న కీర్తి సురేష్ ప్రముఖ నటిగా కనిపించబోతున్నారు. నాగచైతన్య ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుగా మరోసారి కనిపిస్తారు. ఎన్టీఆర్ బయోపిక్ సంక్రాంతికి రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X