twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా వద్ద అలాంటి వేషాలేస్తే అంతే: కాస్టింగ్ కౌచ్ మీద విద్యా బాలన్

    ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంశం మీద, లైంగిక వేధింపుల అంశం మీద విద్యా బాలన్ స్పందించారు.

    By Bojja Kumar
    |

    సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది తరచూ వినిపించే మాట. కొందరు నిర్మాతలు, దర్శకులు హీరోయిన్లను లైంగికంగా వేధిస్తూ... అవకాశాల పేరుతో వారిని బలవతంగా లొంగదీసుకుంటారు అనేది కూడా పలు సందర్భాల్లో నిజమైంది. ఇటీవల హాలీవుడ్లో నిర్మాత హార్వీ వెయిన్‌స్టెన్ వ్యవహారం సంచలనం అయిన సంగతి తెలిసిందే.

    తాజాగా ఓ వార్తా సంస్థ నిర్వహించిన 'స్ట్రైట్ టాక్ విత్ విద్యా బాలన్' కార్యక్రమంలో విద్యాబాలన్ పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. కాస్టింగ్ కౌచ్ అంశంపై కూడా ఆమె స్పందించారు. ఇలాంటి అంశాల్లో తనను తాను సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకుంటానని తెలిపారు.

     అందరినీ ఒకే విధంగా జడ్జి చేయలేం

    అందరినీ ఒకే విధంగా జడ్జి చేయలేం

    లైంగిక వేధింపులు, కౌస్టింగ్ కౌచ్ లాంటి పరిస్థితులు ఎదురైనపుడు చాలా సందర్భాల్లో మహిళలు ఎందుకు మౌనంగా ఉంటారు? అనే ప్రశ్నకు విద్యా బాలన్ స్పందిస్తూ... ఇలాంటి అంశాల్లో అందరినీ ఒకే విధంగా జడ్జి చేయలేం. ఎవరి కారణాలు వారికి ఉంటాయి అని విద్యా బాలన్ అన్నారు.

    నేనే ప్రత్యక్ష ఉదాహరణ

    నేనే ప్రత్యక్ష ఉదాహరణ

    కల్చర్ ఆఫ్ సైలెన్స్ అనేది ఇండియన్ సినిమా పరిశ్రమలోనూ ఉందా? పాశ్యాత్య దేశాల్లో మాదిరిగా ఇక్కడి సినిమా ఇండస్ట్రీలో కౌస్టింగ్ కౌచ్ సంస్కృతి, లైంగికంగా వేధించే వారు ఉన్నారు అనేది బహిరంగ రహస్యమేనా? అనే ప్రశ్నకు విద్యా బాలన్ స్పందిస్తూ... ‘ఇండస్ట్రీలో అందరూ అలా ఉంటారు అని అనుకోకూడదు, అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ' అని విద్యా బాలన్ అన్నారు.

     అది వారి వ్యక్తిగతం

    అది వారి వ్యక్తిగతం

    నేను ఒక ప్రివిలైజ్డ్ బ్యాగ్రౌండ్ నుండి వచ్చాను, నేను సినిమాలను ఒక పాషన్‌తో చేస్తున్నాను. కాస్టింగ్ కౌచ్ లాంటి విషయాలు తన వద్దకు ఏమైనా వస్తే చాలా సీరియస్ గా ఉంటాను. ఆ దారిలో కొందరు ఎందుకు నడుస్తున్నారు అనే విషయమై నేను స్పందించను, అది వారి వ్యక్తిగతం అని విద్యా బాలన్ అన్నారు.

     నా వద్ద అలాంటి వేషాలేస్తే అంతే

    నా వద్ద అలాంటి వేషాలేస్తే అంతే

    నా వద్ద ఎవరైనా కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు లాంటి వేషాలు వేస్తే అస్సలు సహించను. అలాంటి ఆలోచనలు తన వరకు రాకుండా ముందే తగిన హెచ్చరికలు క్రియేట్ చేస్తాను. ఒక వేళ తాను పని చేసే చోట ఎవరిలో అయినా అలాంటి చెడు గుణాలు ఉన్నాయని తెలిస్తే వారికి దూరంగా ఉంటాను అని విద్యా బాలన్ వ్యాఖ్యానించారు.

    English summary
    Actress Vidya Balan says she protected herself against 'sleazy predators' and 'casting couch' in the industry. During an interview on the CNN-News 18 show "Straight Talk with Vidya Balan", Vidya opened up about the clamour around sexual harassment in showbiz after Hollywood producer Harvey Weinstein was named by multiple actresses and models for rape and assault.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X