సెక్సీ లేడీ చీర డీల్ రూ. 5 కోట్లు!
ముంబై : అందంగా కట్టుకోవాలే కానీ.. చీరను మించిన ఫ్యాషన్ లేదనే చెప్పాలి. అందుకే ప్రత్యేక సందర్భం, పండగలు, వేడుకలు అయితే చీర కట్టుకుని సింగారించుకోవాలని ఈ తరం అమ్మాయిలు కూడా ముచ్చటపడుతున్నారు. ఇక సినిమాల్లో హీరోయిలు చీకట్టి ఆరబోసే అందాలు గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని రోజుల క్రితం వచ్చిన 'డర్టీ పిక్చర్' చిత్రంలో హీరోయిన్ విద్యా బాలన్ చీరకట్టులో తన అందాలను ఎంతో సెక్సీగా ప్రదర్శించింది.
ఆ సినిమాలో విద్యా చీరకట్టు అందాలకు మంచి రెస్పాన్స్ రావడంతో ముంబైలోని పాపులర్ సారీ హౌస్ తమ చీరల బ్రాండ్ అంబాసిడర్‌గా విద్యా బాలన్‌ను నియమించుకుంది. ఇందుకోసం విద్యా బాలన్‌తో ఏకంగా రూ. 5 కోట్లతో డీల్ కుదుర్చుకుందట. ఆమెతో చీర కట్టులో సెక్సీ ఫోటో షూట్లు నిర్వహించిన వాటిని తమ చీరల ప్రచారానికి వాడుకోనుందట.
ఆమె సినిమాల విషయానికొస్తే...డర్టీ పిక్చర్ సినిమా ద్వారా సెక్సీ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న విద్యా బాలన్ కూడా త్వరలో ఐటం సాంగులో మెరవ బోతోంది. 'ఫెరారీ కి సవారి' చిత్రానికి గాను విద్యాను ఐటం గర్ల్‌గా ఎంపిక చేశారు. రాజేష్ మస్సూకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, విధు వినోద్ చోప్రా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శర్మాన్ జోషి, బోమన్ ఇరానీ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
వీటితో పాటు ఇమ్రాన్ హస్మి హీరోగా రూపొందుతున్న 'ఘన్ చక్కర్' చిత్రంలో నటిస్తోంది. దీనికి రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తుండగా ఆమె ప్రియుడు సిద్ధార్థ రాయ్ కపూర్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. షాదీకి సైడ్ ఎఫెక్ట్స్ అనే చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయింది.


Click it and Unblock the Notifications











